For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ 2018: మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా ఆస్ట్రేలియా

By Nageshwara Rao
FIFA World Cup 2018: Australia team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.

ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగోసారి. అయితే, ఈసారి ఆ జట్టు కాస్త కష్టంగా రష్యాకు వెళుతోంది. నేరుగా బెర్తు సాధించడంలో విఫలమైన ఆస్ట్రేలియా, హోండురస్‌తో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. టోర్నీలో టిమ్‌ కహిల్‌ అనుభవం, మిడ్‌ఫీల్డ్‌లో మిలె ఎడ్‌నాక్‌ దూకుడు ఆస్ట్రేలియాకు ఎంతో అవసరం.

అయితే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా అర్హత సాధించిన వారం లోపే కోచ్‌ ఏంజ్‌ పొస్టాకొగ్లో పదవికి రాజీనామా చేశాడు. అతని స్థానంలో కొత్తగా నెదర్లాండ్స్‌కు చెందిన బెర్ట్‌ వాన్‌ మార్క్‌ బాధ్యతలు చేపట్టాడు. 2010 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ ఫైనల్‌ చేరడంలో బెర్ట్‌దే కీలకపాత్ర.


దేశం: ఆస్ట్రేలియా


గ్రూపు C: ఫ్రాన్స్‌, డెన్మార్క్, పెరూ, ఆస్ట్రేలియా


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs France
June 21: vs Denmark
June 26: vs Peru


ఫిఫా ర్యాంకింగ్: 40


వరల్డ్‌కప్‌లో ప్రాతినిథ్యం: నాలుగుసార్లు


అత్యుత్తమ ప్రదర్శన: ఉత్తమంగా 2006లో ప్రిక్వార్టర్స్‌ చేరింది


స్టార్ ప్లేయర్లు: ఆరన్‌ మూయ్‌, మాథ్యూ ర్యాన్‌


గత అత్యత్తమ ప్రదర్శన : 2006లో రౌండ్‌ 16


కోచ్‌: బెర్ట్‌ వాన్‌ మార్క్‌


గత రికార్డులు:
No. of matches played (number): 29
No. of matches won: 12
No. of matches lost: 13
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 43


అంచనా: క్వాలిఫయింగ్‌ ప్లే ఆఫ్స్‌లో సిరియా, హోండూరాస్‌లపై కీలక విజయాలతో వరుసగా నాలుగోసారి ప్రపంచకప్‌ అర్హత సాధించిన ఆస్ర్టేలియా.. గత ఫిఫా కప్‌ కన్నా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. అయితే, గ్రూప్‌ దశను దాటే అవకాశం కనిపించడం లేదు.

Story first published: Thursday, June 7, 2018, 18:47 [IST]
Other articles published on Jun 7, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+