For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ 2018: అర్జెంటీనాకు తప్పదు గట్టి పోటీ!

By Nageshwara Rao
FIFA World Cup 2018: Argentina team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో వారం రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

FIFA World Cup 2018: Argentina team, records, fixtures

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.


దేశం: అర్జెంటీనా


గ్రూపు D: అర్జెంటీనా, క్రొయేషియా, నైజీరియా, ఐస్‌లాండ్‌


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs Iceland
June 21: vs Croatia
June 26: vs Nigeria


ఫిఫా ర్యాంకింగ్: 5


రికార్డు: రెండు సార్లు విజేత


గత అత్యుత్తమం: 1978, 1986లో చాంపియన్‌, 1990, 2014 రన్నరప్‌


స్టార్ ప్లేయర్లు: మెస్సీ, జేవియర్‌ మస్క్‌రానో, సెర్గియో రొమేరో


కోచ్: జార్జ్‌ సంపావ్‌లి


గత రికార్డులు:
No. of times team has played in WC (number): 16
No. of matches played (number): 77
No. of matches won: 42
No. of matches lost: 21
No. of times lost in finals (Number): 5
No. of times world cup won (number): 2
No. of goals scored in WC: 131


అంచనా: గ్రూప్‌లో అగ్రస్థానం. రౌండ్‌-16, క్వార్టర్స్‌ దాకా సులువే. ఆ తర్వాత స్పెయిన్‌, బ్రెజిల్‌, జర్మనీలాంటి జట్లతో తలపడాల్సి ఉంటుంది.


టోర్నీలో బలమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. పలువురు స్టార్‌ ఆటగాళ్లతో నిండిన అర్జెంటీనా గ్రూప్‌ టాపర్‌గా నిలుస్తుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు. అతికష్టంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. అనూహ్య పరాజయాలు ఎదుర్కొన్నా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై కెప్టెన్‌ మెస్సీ అమోఘ ఆటతో హ్యాట్రిక్‌ గోల్స్ సాధంచి అర్జెంటీనాను వరల్డ్ కప్‌కు అర్హత సాధించేలా చేశాడు.

మెస్సితోపాటు గొంజాలో హిగెయిన్‌, అగ్వెరో వంటి స్టార్లతో నిండిన అర్జెంటీనా ఇప్పటికీ ఫేవరెటే అయినప్పటికీ.. ఇంకా మెరుగుపడాల్సివుంది. ఏడాదిలోనే అర్జెంటీనాకు ముగ్గురు కోచ్‌లు మారారు. ప్రస్తుత కోచ్‌ సంపావ్‌లీ ఆధ్వర్యంలోని జట్టు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. నాలుగు అధికారిక మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే నెగ్గింది. మిగతా మూడు జట్లు బలంగానే రేసులో ఉన్నాయి.

Story first published: Thursday, June 7, 2018, 18:50 [IST]
Other articles published on Jun 7, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+