సాకర్ సంరంభం: గాయంతో అర్జెంటీనాకు సెర్జియో రోమియో దూరం

హైదరాబాద్: వరల్డ్ కప్ టైటిల్ దక్కించుకునే జట్ల జాబితాలో ముందు వరుసలో ఉన్న దేశాలన్నీ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందులో భాగంగానే అర్జెంటీనా జట్టు కూడా కష్టాల్లో చిక్కుకున్నది. వచ్చేనెల 14వ తేదీ నుంచి రష్యాలో సాకర్ కప్ సంరంభం ప్రారంభం కానున్నది.
ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన గోల్ కీపర్ సెర్జియో రోమియో టోర్నీకి దూరమయ్యాడు. మోకాలికి అయిన గాయంతో సెర్జియో రోమియో స్థానంలో నాహ్యుల్ గుజ్మన్ ను గోల్ కీపర్‌గా ఎంపిక చేస్తూ అర్జెంటీనా ఫుట్ బాల్ సమాఖ్య నిర్ణయం తీసుకున్నది.

సెర్జియో రోమియో నంబర్ వన్ గోల్ కీపర్
సెర్జియో రోమియో అర్జెంటీనా నంబర్ వన్ గోల్ కీపర్. కానీ రష్యాలో జరిగే సాకర్ సంరంభానికి దూరం కానున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో మోకాలికి అయిన గాయంతో ఆయన గ్లోవ్స్ వేసుకోవడం కష్టమే. ఎఫ్ఎ కప్ టోర్నీలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో సెర్జియో రోమియో గోల్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. కానీ జట్టు మేనేజర్ జోస్ మౌరిన్హో మాత్రం సెర్జియో రోమియో ఫిట్ నెస్‌తో లేకపోవడంతో ఆయన స్థానంలో డేవిడ్ డీ గియాను ఎంపిక చేశాడు.

జర్మనీ చేతిలో 1-0 స్కోర్ తేడాతో 2014లో ఓటమి
2014లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీపై 1 - 0 స్కోర్ తేడాతో అర్జెంటీనా ఓటమి పాలైంది. జర్మనీలో టైటిల్ కొట్టే అవకాశం మిస్సైన సెర్జియో రోమియో తాజాగా రష్యాలో జరిగే టోర్నీలో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశమే కోల్పోయాడు.

ముగ్గురు గోల్ కీపర్లతో వరల్డ్ కప్ టోర్నీకి అర్జెంటీనా
ముగ్గురు గోల్ కీపర్లతో అర్జెంటీనా వచ్చేనెలలో జరిగే సాకర్ కప్ సంరంభంలో పాల్గొననున్నది. గుజ్మన్ తోపాటు మరో ఇద్దరు గోల్ కీపర్లు అందుబాటులో ఉంటారు. అర్జెంటీనా ఫుట్ బాల్ సమాఖ్య ఈ నెల 22వ తేదీనే జట్టును ఎంపిక చేసింది. ఇంటర్ కెప్టెన్ మౌరో ఇకార్డీని ప్రారంభంలో తొలగించినట్లు కోచ్ జార్జి సాంపోలీ తెలిపాడు. చెల్సియాకు చెందిన విల్లీ చాబాల్లెరో, రివర్ ప్లేట్‌లో ఫ్రాన్స్ ఆర్మానీ తదితరులు జట్టులో సభ్యులుగా ఉన్నారు. కుడి మోకాలికి అయిన గాయానికి సెర్జియో రోమియోకు శస్త్ర చికత్స చేయించాల్సిన అవసరం ఉన్నదని కోచ్ జార్జి సాంపోలీ చెప్పాడు. అర్జెంటీనా వరల్డ్ కప్ టోర్నీలో డీ గ్రూపులో ఐస్లాండ్, క్రొయేషియా, నైజీరియా జట్లతో కలిసి ఆడనున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications