Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్జెంటీనాకు భారీ షాక్: క్రొయేషియా చేతిలో 3-0తో ఓటమి

Fifa World Cup 2018 : Australia-Denmark Match Was Draw
FIFA World Cup 2018, Argentina 0 Croatia 3: Caballero drops clanger as Messis men are stunned

హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్టార్ ప్లేయర్లు ఉన్న అర్జెంటీనాకు భారీ షాకిచ్చింది. గురువారం జ‌రిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వరల్డ్ కప్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా దారుణంగా విఫలమైంది.

1
958042
అర్జెంటీనాపై 3-0తో క్రొయేషియా ఘన విజయం

అర్జెంటీనాపై 3-0తో క్రొయేషియా ఘన విజయం

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై క్రొయేషియా 3-0తేడాతో ఘన విజయం సాధించింది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్రత్యర్ధి జట్టు డిఫెండర్లు బలంగా అడ్డుకున్నారు. దీంతో క్రొయేషియా ఈ మ్యాచ్‌లో 3-0తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి క్వార్ట‌ర్స్‌కు త‌న స్థానాన్ని దాదాపు ఖ‌రారు చేసుకుంది.

 రెండో అర్ధభాగంలోక్రొయేషియా పైచేయి

రెండో అర్ధభాగంలోక్రొయేషియా పైచేయి

మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, రెండో అర్ధభాగంలో మాత్రం అర్జెంటీనాపై క్రొయేషియా పైచేయి సాధించింది. అర్జెంటీనా గోల్ కీప‌ర్ కాబ‌రెల్లో ఛేసిన త‌ప్పు క్రొయేషియాకు తొలి గోల్‌ను అందించింది. ఆట 53వ నిమిషంలో రెబిక్ మొద‌టి గోల్ చేసి క్రొయేషియాకు ఆధిక్యాన్ని అందించాడు.

80వ నిమిషంలో క్రొయేషియా తొలి గోల్

ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఆట 80వ నిమిషంలో మోడ‌రిక్ క‌ర్ల్ షాట్‌తో సూప‌ర్ గోల్ చేసి అంద‌రిని ఆశ్చర్యపరిచాడు. దీంతో క్రొయేషియా ఆధిక్యం 2-0కు చేరింది. దీంతో ఈ షాక్ నుంచి అర్జెంటీనా తేరుకోలేకపోయింది. మ‌ళ్లీ 91వ నిమిషంలో మూడో గోల్ చేసి అర్జెంటీనాపై మరోసారి తన ఆధిక్యాన్ని పెంచుకుంది.

అనూహ్య రీతిలో క్రొయేషియా చేతిలో ఓటమి

మూడో గోల్‌ని రాక్‌టిక్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అర్జెంటీనా అనూహ్య రీతిలో క్రొయేషియా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఎన్ని సార్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ, అర్జెంటీనాకు క‌లిసిరాలేదు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఐస్‌ల్యాండ్‌తో డ్రా చేసుకున్న అర్జెంటీనాకు ఇప్పుడు క్వార్ట‌ర్స్‌కు వెళ్లే అవ‌కాశాలు సన్నగిల్లాయి.

Story first published: Friday, June 22, 2018, 15:15 [IST]
Other articles published on Jun 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+