ఫిఫా కప్: ఒంపుసొంపులతో అదరగొట్టిన షకీరా
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్ సంరంభం ముగిసింది. నెలరోజులుగా జరుగుతున్న ఈ పోటీలకు ఆఖరిరోజైన ఆదివారం రియో డి జనీరో సాకర్ మైదానం సాంబా నృత్యాలు, షకీరా ఆటాపాటలతో హోరెత్తింది. ఆరంభంలోనే షకీరా 'లా లాలా' పాటతో అదరగొట్టింది.
కేవలం వరల్డ్‌కప్ కోసం షకీరా రూపొందించిన ఈ పాట ఆద్యంతం అద్భుతంగా సాగింది. నడుం వొంపుల వయ్యారాలతో యువతను అమితంగా ఆకట్టుకున్న షకీరా నృత్యం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ కప్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం షకీరాకి ఇది మూడోసారి.

హైతీకి చెందిన హిప్ హాప్ స్టార్ వేక్లెఫ్ జీన్, బ్రెజిల్ సింగర్ అలెగ్జాండ్రే పైరెస్ కలిసి 'డర్ ఉమ్ జైటో' అంటూ పాటందుకుని స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. మెక్సికో గిటారిస్ట్ కార్లోస్ శాంటనా సూపర్బ్ అనిపించాడు.
ఆ తర్వాత 46 ఏళ్ల బ్రెజీలియన్ సింగర్ ఐవేటే సంగాలో తన పాటతో అలరించింది. ఇక ఫైనల్ జట్లయిన అర్జెంటీనా, జర్మనీలకు చెందిన మిరుమిట్లు గొలిపే దుస్తులు ధరించిన యువతులు హొయలుపోయిన తీరు అద్భుతంగా ఉంది.మిలన్ పికూ తన తల్లి షకీరాతో దర్శనమిచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications