సాకర్ వరల్డ్ కప్ లో రెచ్చిపోనున్న చిచ్చరపిడులు వీళ్ళే

సొటిరిస్ నినిస్
20 ఏళ్లకే ఎంతో అనుభవం సంపాదించాడీ గ్రీస్ మిడ్ ఫీల్డర్. తిరుగులేని ఎటాకరైన నినిస్..మైదానంలో ఎక్కడి నుంచైనా గోల్ కొట్టగల సమర్థుడు. 2007 నుంచి పనాతినైకోస్ క్లబ్ కు ఆడుతున్నాడు. నినిస్ ఆడుతున్న తొలి మేజర్ టోర్నీ ప్రపంచకప్పే. మాంచెస్టర్ యునైటెడ్, మిలన్ క్లబ్‌లు కన్నేసిన ఈ యువ ఆటగాడు.. సఫారీ గడ్డపై సంచలనాలు సృష్టిస్తాడన్నది విశ్లేషకుల మాట.
స్టెఫానీ ఎంబియా
ప్రొఫెషనల్ లీగ్స్‌లో బాగా అనుభవమున్న ఎంబియా జాతీయ జట్టుకు ఆడింది తక్కువ. డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్, సెంటర్ బ్యాక్‌తోపాటు విభిన్న పాత్రలు పోషిస్తాడు. తిరుగులేని వేగం అతని సొంతం. ఈటోతో కలిసి స్టెఫానీ మెరిశాడంటే కామెరూన్ ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టించగలదని విశ్లేషకులు అంటున్నారు.
వాల్టర్ బర్సా
చాన్నాళ్లుగా స్లొవేనియాకు ఆడుతున్న ఈ ఫార్వర్డ్.. ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. పాస్‌లు అందించడంలో దిట్ట అయిన బర్సాకు బంతిపై మంచి పట్టుంటుంది. అర్హత పోటీల్లో అతను కొట్టిన రెండు గోల్స్ స్లొవేనియాకు కీలక విజయాలందించాయి. రష్యాతో చావోరేవో మ్యాచ్‌లో బర్సా ఇచ్చిన సూపర్ పాస్‌తో గోల్ నమోదైంది. ప్రపంచకప్‌లోనూ బర్సా ఇదే జోరు కొనసాగిస్తాడని స్లొవేనియా ఆశిస్తోంది.
జాంగ్ టే సి
పుట్టింది జపాన్‌లో అయినా, చదువంతా ఉత్తర కొరియాలో సాగడంతో.. ఆ దేశానికే ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు జాంగ్. దీనిపై స్వదేశంలో వివాదం చెలరేగినా పట్టించుకోలేదు. అర్హత పోటీల్లో మంచి ప్రదర్శనే చేశాడు. బలమైన గ్రూప్‌లో ఉన్న ఉత్తర కొరియా.. సంచలనాలు సృష్టించి రెండో దశకు చేరడం జాంగ్ ప్రదర్శన మీదే ఆధారపడి ఉంటుంది.
కి సుంగ్ యాంగ్
దక్షిణ కొరియా అభిమానులు తమ దేశపు 'స్టీవెన్ గెరాడ్'గా పిలుచుకునే యాంగ్ తిరుగులేని సెంటర్ మిడ్‌ఫీల్డర్. 2007లో ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌లో మెరుపులతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ వెంటనే ప్రొఫెషనల్ లీగ్‌ల్లోకి దూసుకొచ్చాడు. యాంగ్ చేరికతో దక్షిణ కొరియా మిడ్‌ఫీల్డ్ ఎప్పుడూ లేనంత పటిష్టంగా తయారైంది. యాంగ్ మెరిశాడంటే దక్షిణ కొరియా మరోసారి 2002 ప్రదర్శనను పునరావృతం చేయడం ఖాయం.
కయుకి మారిమోటో
ఆసియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇటాలియన్ సిరీస్-ఎ టోర్నమెంట్లో మెరుపులు మెరిపించాడు. మాంచెస్టర్ యునైటెడ్ త్వరలోనే మారిమోటోను జట్టులో చేర్చుకునే అవకాశముంది. దేశానికి రెండుసార్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచకప్‌లో ఈ స్త్ట్రెకర్‌పై జపాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications