ఫిఫా కప్: మెక్సికోతో దక్షిణాఫ్రికా మ్యాచ్ డ్రా

ఆరంభంలో ఆధిక్యమంతా మెక్సికోదే. తొలి 20 నిమిషాలు ఆ జట్టు అధీనంలోనే బంతి. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందేమోనని అందరూ భావించారు. కానీ బఫానా...బఫానా నెమ్మదిగా పుంజుకుంది. అప్పటివరకు మెక్సికో దాడులను కాచుకునేందుకే పరిమితమైన దక్షిణాఫ్రికా ఎటాకింగ్ ఆరంభించింది. 23వ నిమిషంలో మఫేలా ఓ క్రాస్ ను గోల్‌పోస్టులోకి పంపించినంత పనిచేశాడు. అప్రమత్తంగా ఉన్న మెక్సికో గోల్‌కీపర్ పెరెజ్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. 36వ నిమిషంలో వేలా అందించిన పాస్ ను అందుకుని మెక్సికో ఏకంగా గోలే చేసింది. కానీ లైన్ మెన్ ఆఫ్ సైడ్ గా ప్రకటించడంతో ఆ ప్రయత్నం వృథా అయింది. మొత్తం మీద తొలి అర్ధభాగం మెక్సికో ఆధిక్యం సాధించినా గోల్ మాత్రం చేయలేకపోయింది.
రెండో అర్ధబాగంలో బఫానా బఫానా మ్యాజిక్ ఆరంభమైంది. 55వ నిమిషంలో పియనార్ మెక్సికో రక్షణశ్రేణిని చీల్చుతూ అద్భుతమైన పాస్ ను మిడ్ ఫీల్డర్ షబలాలాకు అందించాడు. అంతే అద్భుతంగా షబలాలా మెక్సికో గోల్ కీపర్ పెరెజ్‌కు ఎలాంటి అవకాశమివ్వకుండా ఎడమకాలితో బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. అంతే..అప్పటివరకు సాకర్ స్టేడియాన్ని మోతెక్కిస్తున్న వువుజెలా ధ్వనులు రెట్టింపయ్యాయి. అక్కడి నుంచి దక్షిణాఫ్రికా ఆట పూర్తిగా మారిపోయింది. ఆటలో జోరు పెరిగింది. మరోవైపు షబలాలా గోల్ తో షాక్ తిన్న మెక్సికో కోచ్ జేవియర్ అగ్విరె కీలకమైన మార్పులు చేశాడు.ఫలితం..79వ నిమిషంలో దక్షిణాఫ్రికా డిఫెన్స్‌ను..అప్పటివరకు అద్భుతంగా రాణించిన గోల్ కీపర్ కునేను బోల్తా కొట్టిస్తూ డిఫెండర్ మార్కెజ్ గోల్ చేశాడు. స్కోరు (1-1) సమం చేశాడు. ఇక మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా 89వ నిమిషంలో దక్షిణాఫ్రికా దాదాపు గోల్ చేసినంత పని చేసింది. ఫార్వర్డ్ ఎంఫెలా మెక్సికో డిఫెన్స్‌ను ఛేదిస్తూ ముందుకెళ్లాడు. కానీ బంతి గోల్‌పోస్ట్‌కు తగిలింది. తొలి గోల్ చేసిన షబలాలాకే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో బంతిని చేతితో ఆడ్డుకున్న జురెజ్‌కు తొలి ఎల్లో కార్డు లభించింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications