ఇంగ్లాండ్ రాకుమారుడి వివాహం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ ఎక్కువ...!!

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా క్రీడా ఔత్సాహికులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫాలో అద్భుతాలు కొదవలేదు. రష్యా వేదికగా జరుగుతున్న పోటీలలో స్టార్ ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు. అసలే ఫుట్‌బాల్‌పై అమితాసక్తి అంతకంటే మ్యాచ్‌లలో చేస్తున్న విన్యాసాలతో ఆటగాళ్లందరికీ వేరే ధ్యాస లేకుండా పోతోంది. మొన్నటికి మొన్న తొలిసారి ప్రపంచకప్ అర్హత సాధించి మొదటి మ్యాచ్ ఆడింది ఐస్‌లాండ్.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
అర్జెంటీనాతో జరిగిన ఈ మ్యాచ్‌ను ఐస్‌లాండ్ దేశం మొత్తం(99.6శాతం) చూసినట్లు ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతే ఆశ్చర్యకరమైన సంఘటన మరొకటి సంభవించింది. తాజాగా ఓ సర్వే వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్ దేశపు ప్రిన్స్ హ్యారీ నవ వధువు మేఘన్ మెర్కెల్‌ను వివాహమాడాడు. అయితే దీని కంటే ఇంగ్లాండ్-టునీషియా మధ్య జరిగిన మ్యాచ్‌నే ఎక్కువ మంది చూశారట.
మే 19న హ్యారీ-మేగనా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీరి వివాహాన్ని ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్ల మంది వీక్షించారు. ఇందులో ఒక్క లండన్ నుంచే 18 మిలియన్ల మంది వీక్షించారు. ఇక సోమవారం ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్-టునీషియా మధ్య జరిగిన మ్యాచ్‌కు లండన్ వాసులు బ్రహ్మరథం పట్టారు.
ఈ మ్యాచ్‌ను యూకేలో 18.3 మిలియన్ల మంది చూశారట. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ ఎలా ఉందో.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్ చేయడంతో 2-1 తేడాతో టునీషియాపై విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్‌లో పనామాను ఢీకొట్టనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications