న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

60 ఏళ్ల తర్వాత ఫిఫాలో విజయం సాధించిన స్వీడన్

FIFA WC 2018 Highlights: Sweden edge South Korea

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌ 'గ్రూప్‌ ఎఫ్'‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో స్వీడన్‌ బోణీ చేసినట్లైంది. మ్యాచ్‌ మొత్తంలో ఎక్కువ భాగం బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న స్వీడన్ 65వ నిమిషంలో గోల్ కొట్టింది. స్వీడన్‌ డిఫెండర్‌ ఆండ్రియాస్‌ గ్రాన్‌క్విస్ట్‌ గోల్‌గా మలిచాడు.

ఆ తర్వాత ఆధిక్యాన్ని సమం చేసేందుకు దక్షిణ కొరియా ఆఖరి వరకూ ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. ఇది అతని అంతర్జాతీయ కెరీర్‌లోనే ఏడో గోల్. దీంతో స్వీడన్‌కు 1-0 ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ చివరి వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొంది. మ్యాచ్‌ 65వ నిమిషంలో దక్కిన పెనాల్టీని స్వీడన్ చక్కగా వినియోగించుకుంది.

మ్యాచ్‌ మొత్తంలో స్వీడన్ 15 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేయగా.. దక్షిణా కొరియా 5 సార్లు మాత్రమే గోల్ ప్రయత్నం చేసింది. 2002లో నైజీరియాతో జరిగిన మ్యాచ్‌ తర్వాత ప్రపంచ కప్‌లో స్వీడన్‌ గోల్‌ కొట్టిన తొలి పెనాల్టీ ఇదే కావడం గమనార్హం. దక్షిణ కొరియా స్వీడన్‌తో తలపడిన చివరి ఐదు సార్లు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌కు మరో విశేషం కూడా ఉంది.

1958 తర్వాత ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లో స్వీడన్ గెలుపొందడం ఇదే తొలిసారి. అప్పట్లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో స్వీడన్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గలేదు. ఐదు సార్లు ఓడిపోగా.. రెండు సార్లు ఫలితం తేలలేదు.

Story first published: Tuesday, June 19, 2018, 9:45 [IST]
Other articles published on Jun 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X