Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెక్సికోపై విజయంతో.. క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన బ్రెజిల్

FIFA World Cup 2018: Neymar,Firmino Take Brazil To Quarters
neymar-firmino

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో దిగ్గజ జట్లన్ని ఇంటి బాట పడుతుంటే.. బ్రెజిల్ మాత్రం మెరుపులు కురిపిస్తోంది. ఐదు సార్లు ఫిఫా ప్రపంచకప్ విజేత బ్రెజిల్ మరోసారి ట్రోఫీ దిశగా ముందడుగు వేసింది. ప్రత్యర్థికి బంతి అందకుండా ఆడి ఫైనల్స్‌లో చోటు సంపాదించింది. తద్వారా వరసగా ఏడో ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన జట్టుగా నిలిచింది. రెండో రౌండ్‌లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఈ ఓటమితో మెక్సికో వరసగా ఏడో సారి లాస్ట్-16 దశ నుంచి నిష్క్రమించింది. తొలి అర్ధభాగం పోటా పోటీగా జరిగినప్పటికీ విరామ సమయం అనంతరం బ్రెజిల్‌ దూకుడు పెంచింది. మ్యాచ్ ఆరంభం నుంచి బ్రెజిల్, మెక్సికోలు అమీతుమీగా తలపడ్డాయి. ఈ క్రమంలో రెండు గోల్స్‌ కొట్టడంతో పాటు బ్రెజిల్‌ రక్షణశ్రేణి బలంగా ఉండటంతో మెక్సికో గోల్‌ యత్నాలు ఫలించలేదు.

బ్రెజిల్ అటాకింగ్ గేమ్‌కు మెక్సికో తొలి సగంలో తలవంచలేదు. మెక్సికన్ డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరుతో బ్రెజిల్‌ను నియంత్రించారు. అయితే ఇదంతా తొలి సగం వరకే. ద్వితీయార్థంలో బ్రెజిల్ ధాటికి మెక్సికో నిలవలేదు. 51వ నిమిషంలో నెయిమర్ బ్రెజిల్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మెక్సికో ఊపు తగ్గింది. మ్యాచ్ పై క్రమక్రమంగా ఆశలు వదిలేసుకున్నట్టుగా ఆడింది మెక్సికన్ జట్టు. 88వ నిమిషంలో మరోసారి బ్రెజిల్ గర్జించింది. రొబర్టో ఫిర్మినో తమ జట్టు ఆధిక్యతను 2-0కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆరు నిమిషాల స్టాపేజ్ టైమ్ లభించినా బ్రెజిల్ ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది మెక్సికో.

1
958075

తొలి సగంలో ఇరు జట్లూ గోల్ అవకాశాలను చేజార్చుకున్నాయి. సెకెండాఫ్‌లో బ్రెజిల్ పట్టు విడవలేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌ల్లోనూ బ్రెజిల్‌ పాల్గొని ఐదుసార్లు కప్‌ గెలుచుకుంది. బెల్జియమ్ వర్సెస్ జపాన్ మ్యాచ్‌లో విజేత బ్రెజిల్‌తో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, July 3, 2018, 10:42 [IST]
Other articles published on Jul 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+