Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫేవరేట్‌గా టోర్నీ ఆరంభించిన జర్మనీ.. ఇక ఇంటికే..!!

Germany 0 - South Korea 2

హైదరాబాద్: డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ జర్మనీకి ఘోర పరాభవం. ఫిఫా ప్రపంచకప్‌ నుంచి ఇంటి ముఖం పట్టింది. రష్యా వేదికగా జరుగుతున్న బుధవారం గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయింది. దక్షిణకొరియా ఏకంగా 2 గోల్స్‌ కొట్టగా జర్మనీ ఒక్క గోల్‌ సాధించలేకపోయింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

జర్మనీ ఆడిన మూడింటిలో ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. టైటిల్‌ ఫేవరేట్‌గా టోర్నీకి వచ్చిన జర్మనీ పేలవమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో పాయింట్ల జాబితాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జర్మనీ నాకౌట్‌దశకు క్వాలిఫై కాలేదు. నాలుగుసార్లు విజేతగా నిలిచిన జర్మనీ ఈ టోర్నీలో లీగ్‌ దశలోనే తప్పుకోవడం సంచలనమైంది.

1
958053

1938 తరువాత తొలి రౌండ్‌లో జర్మనీ వెనుదిరగడం ఇదే తొలిసారి. నాలుగు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆజట్టుకు సౌత్ కొరియా ఊహించని షాక్ ఇచ్చింది. సౌత్ కొరియా సైతం నాకౌట్‌కు అర్హత సాధించలేదు. ఆ జట్టుకు టోర్నీలో ఇదే తొలి గెలుపు. పోతూ పోతూ జర్మనీని కూడా ఇంటికి తీసుకెళ్లింది.

ఇదే సమయంలో జరిగిన మరో మ్యాచ్‌లో స్వీడన్ 3-0తో మెక్సికోపై ఘన విజయం సాధించింది. గ్రూప్-ఎఫ్‌లో ఆరు పాయింట్లతో స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికో కూడా 6 పాయింట్లతో ఉన్నప్పటికీ గోల్స్ తేడాతో స్వీడన్ టాప్‌లో ఉంది. జర్మనీ 0-2తో సౌత్‌కొరియా చేతిలో ఓటమిపాలవడంతో మెక్సికో తుది-16లో చోటు దక్కించుకుంది. దీంతో పాయింట్ల జాబితాలో తొలి రెండుస్థానాల్లో నిలిచిన స్వీడన్‌, మెక్సికోలు రెండో రౌండ్లోకి ప్రవేశించగా జర్మనీ, కొరియాలు ఇంటి దారి పట్టాయి.

Story first published: Wednesday, June 27, 2018, 22:27 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+