For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రాగా ముగిసిన డెన్మార్క్.. ఆస్ట్రేలియాల పోరాటం

FIFA WC 2018 Highlights: Denmark, Australia split points in entertaining draw

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-సీలో గురువారం డెన్మార్క్.. ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు.. డ్రా ముగిసింది. మ్యాచ్ సమయం ముగిసేవరకు పోరాడిన ఇరు జట్లు ఆఖరికి 1-1తో డ్రాగా ముగించాయి. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న డెన్మార్క్‌కు.. 40వ ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా గట్టిపోటీనిచ్చింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

డార్క్‌హార్స్‌గా బరిలో దిగిన డెన్మార్క్ మ్యాచ్ ఆరంభమైన ఏడో నిమిషంలోనే తొలి గోల్ కొట్టి అబ్బురపరిచింది. డెన్మార్క్‌ మిడ్‌ఫీల్డర్‌ ఎరిక్‌సన్‌ 7వ నిమిషంలో గోల్‌ చేసి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి నుంచి ఇరు జట్లు బంతిని నియంత్రణలో ఉంచుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి.

కాగా ఈ క్రమంలో 37వ నిమిషంలో వార్‌ రూపంలో ఆస్ట్రేలియాకు పెనాల్టీ లభించింది. దీంతో 38వ నిమిషంలో ఆసీస్‌ ఆటగాడు జెడ్నిక్‌ పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోరును 1-1కి సమం చేశాడు.

1
958037

తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేసి ఆకట్టుకున్నాయి. రెండో సెషన్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు జట్లు పూర్తిగా రక్షణాత్మక ఆటతీరుతో వ్యవహరించడంతో రెండో అర్ధభాగం గోల్స్ లేకుండానే 0-0తో ముగిసింది. 74వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు భుజం గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.

బంతిని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు, గోల్‌పోస్ట్‌పై దాడి చేసేందుకు తమ శాయశక్తులా పోరాటం చేశాయి. గ్రూప్-సీలో భాగంగా గత శనివారం జరిగిన పోరులో 1-0తో పెరూపై డెన్మార్క్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు గ్రూప్-సీలో భాగంగా కొద్దిరోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Story first published: Thursday, June 21, 2018, 20:08 [IST]
Other articles published on Jun 21, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+