
సెమీస్‌కు చేరిన బెల్జియం
ఈ ఓటమితో టోర్నీలో బ్రెజిల్ కథ ముగియగా, బెల్జియం సెమీస్‌కు చేరుకుంది. ఆరో వరల్డ్‌కప్‌పై కన్నేసిన బ్రెజిల్‌కు ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. మ్యాచ్ ఆరంభంలోనే సెల్ఫ్ గోల్ చేసి ప్రత్యర్థికి చేజేతులా ఆధిక్యాన్ని ఇవ్వడం బ్రెజిల్‌కు చేటు చేసింది. 13వ నిమిషంలో బ్రెజిల్ డిఫెండర్ ఫెర్నాండినో సెల్ఫ్ గోల్ నమోదు చేశాడు.
|
ఫెర్నాండినో భుజాన్ని తాకుతూ బ్రెజిల్ గోల్ పోస్టులోకి
బెల్జియంకు దక్కిన కార్నర్ కిక్‌ను డి బ్రూన్ బ్రెజిల్ గోల్ పోస్టులోకి కొట్టాడు. అయితే, దీనిని విన్సెంట్ కొంపాని హెడర్‌తో గోల్ చేసేందుకు ప్రయత్నించగా బంతి అతన్ని దాటి ఫెర్నాండినో భుజాన్ని తాకుతూ బ్రెజిల్ గోల్ పోస్టులోకి వెళ్లింది. ఈ షాక్ నుంచి కోలుకునేలోపే బ్రెజిల్‌ను బెల్జియం జట్టు మరోసారి దెబ్బ కొట్టింది.

31వ నిమిషంలో రెండో గోల్ నమోదు చేసిన బెల్జియం
ఆట 31వ నిమిషంలో లుకాకు నుంచి పాస్ అందుకున్న డిబ్రూన్ అద్భుతమైన షాట్‌తో బంతిని బ్రెజిల్ పోస్ట్‌లోకి కొట్టాడు. దీంతో తొలి అర్దభాగం ముగిసే సరికి బెల్జియం 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో బ్రెజిల్ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో 76వ నిమిషంలో రెనాటో అగస్టో గోల్ కొట్టడంతో 1-2 ఆధిక్యాన్ని సంపాదించింది.
|
క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన బ్రెజిల్
చివర్లో ఎదురుదాడే లక్ష్యంగా ఆడి మరో గోల్ కొట్టేందుకు బ్రెజిల్ చేసిన ప్రయత్నించినప్పటికీ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బ్రెజిల్ జట్టు క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు మంగళవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే సెమీస్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం తలపడనుంది.