
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సమరా ఎరెనా మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా జట్టు 1-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరు జట్లు ప్రథమార్థంలో ఒక్క గోల్ నమోదు చేయలేకపోయాయి. ద్వితీయార్థంలో కొంచెం దూకుడు పెంచిన ఇరు జట్లు గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించాయి.
రెండో అర్ధభాగం ప్రారంభమైన కాసేపటికి సెర్బియా కెప్టెన్ కొలరోవ్ 56వ నిమిషంలో ఫ్రీకిక్ రూపంలో వచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలిచాడు. కానీ, మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు కావడానికి 56 నిమిషాలు పట్టింది. దీంతో సెర్బియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచులో సెర్బియా ఆటగాడు ఇవనోవిక్‌కు 104వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. తాజా విజయంతో సెర్బియా 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడిన మొదటి మ్యాచును గెలిచింది.
సెర్బియా జట్టు 1998లో ప్రపంచకప్‌లో ఇరాన్‌పై 1 - 0 తేడాతో గెలిచింది. ఫ్రీకిక్ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెర్బియా కెప్టెన్ అలెగ్జాండర్ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో సెర్బియా 1-0తో ఆధీనంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్‌లో మరొక గోల్ నమోదు కాకపోవడంతో సెర్బియా విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో రిఫరీ ఇద్దరు సెర్బియా (ఇవనోవిక్, ప్రిజోవిక్), ఇద్దరు కోస్టారికా ఆటగాళ్ల(కాల్వొ, గుజ్మన్)కు ఎల్లో కార్డు చూపించారు. నేటి మ్యాచ్‌లో కోస్టారికా 14 అనవసర తప్పిదాలు చేయగా, సెర్బియా 11 తప్పిదాలు చేసింది.