ఫిఫా వరల్డ్ కప్: బ్రెజిల్ కథ ముగిసింది, ఫైనల్లో ఇంగ్లాండ్ Vs స్పెయిన్
హైదరాబాద్: భారత్‌లో జరుగుతున్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీలో బ్రెజిల్ కథ ముగిసింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఆటగాడు రియాన్ బ్రూస్టర్ రికార్డుస్థాయిలో రెండోసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించి తన జట్టును ఫైనల్ చేర్చాడు.
దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు క్వార్టర్స్ కూడా చేరుకుని ఇంగ్లాండ్ జట్టు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను కలిగించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో రియాన్ బ్రూస్టర్ హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో ఇంగ్లాండ్ 3-1తో బ్రెజిల్‌ను ఓడించింది.

బ్రెజిల్ డిఫెన్స్‌ను ఛేదించిన బ్రూస్టర్
పటిష్టమైన బ్రెజిల్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ లివర్‌పూర్ యువ ఆటగాడు బ్రూస్టర్ 10వ, 39వ, 77వ నిమిషాల్లో గోల్స్ కొట్టి ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. బ్రూస్టర్‌కిది ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. అమెరికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కూడా బ్రూస్టర్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు.

తొలి ప్లేయర్‌గా బ్రూస్టర్ చరిత్ర
దీంతో ఒక ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్ గోల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా బ్రూస్టర్ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు ఈ టోర్నీలో బ్రూస్టర్ మొత్తంగా ఏడు గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు బ్రెజిల్‌కే మద్దతు పలికినప్పటికీ ఓటమిపాలైంది.

మరో సెమీస్‌లో మాలిపై స్పెయిన్ విజయం
బ్రెజిల్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను వెస్లీ 21వ నిమిషంలో సాధించాడు. ఇక, మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 3-1తో మాలి జట్టును ఓడించింది. అబెల్ రూయిజ్ 19వ, 43వ నిమిషాల్లో గోల్స్ సాధించగా.. పెర్రాన్ 71వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం ఫైనల్
ఇక, 74వ నిమిషంలో మాలి ఆటగాడు దియాయే జట్టుకు ఏకైక గోల్ అందించాడు. ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ఫైనల్లో స్పెయిన్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications