FIFA U17 Women’s World Cup: ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భువనేశ్వర్‌లో భారత్ మ్యాచ్‌లు

ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్ ఇవాళ అధికారికంగా విడుదలయింది. ఇకపోతే ఈ టోర్నీకి భారత్ 2017లో తొలిసారి ఆతిథ్యమివ్వగా.. 2022లో మరోసారి ఆతిథ్యానికి రెడీ అయింది. అక్టోబర్ 11నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక కొన్ని రోజులు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. అక్టోబర్ 30వరకు టోర్నీ సాగుతుంది. అక్టోబర్ 30న ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్ జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు గోవాలో జరుగుతాయి. ఇక ఈరోజు ఫిఫా, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్వోసీ) పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ఈ టోర్నీలో మొత్తం 16 దేశాల జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీని ఇండియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. భారత్‌లో ఫుట్ బాల్ క్రీడను డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఇక మొత్తం ఒడిశా, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వివిధ స్టేడియాల్లో మొత్తం 32మ్యాచ్‌లు టోర్నీలో జరుగనున్నాయి. గ్రూప్ దశలో 24 మ్యాచ్‌లు జరుగుతాయి.
అక్టోబర్ 18వరకు గ్రూప్ మ్యాచ్‌లు పూర్తవుతాయి. తర్వాత నాకౌట్ దశ ప్రారంభమవుతాయి. నాకౌట్లో 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు, తర్వాత సెమీఫైనల్ మ్యాచ్‌లు, అక్టోబర్ 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక గ్రూప్ దశలో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్‌లు 11, 14, 17తేదీల్లో జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications