కోల్‌కతాలో ఫైనల్: రూ.48కే వరల్డ్ కప్ టికెట్
హైదరాబాద్: పుట్ బాల్ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారత్‌లో జరిగే అండర్ 17 ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ పోటీల టికెట్ ధరలను ప్రకటించారు. భారత్‌లో పుట్‌బాల్ పట్ల ఆదరణ పెంచేందుకు గాను మ్యాచ్ టికెట్‌లను కనిష్టంగా కేవలం రూ.48కే అందించనున్నారు.
ఫైనల్ మ్యాచ్ ధర కూడా రూ. 48గా నిర్ణయించారు. అయితే పది టికెట్లను ఒకేసారి కొనాల్సి ఉంటుంది. 60 శాతం తక్కువ ధరతో సీజన్ టికెట్ల (10 మ్యాచ్‌లు)ను నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇతర స్టాండ్స్ టికెట్ ధరలు రూ.96, రూ.192గా ఉన్నాయి.

మంగళవారం రాత్రి 7.11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్‌లు అందుబాటులో ఉంటాయని టోర్నీ డైరెక్టర్ జేవియర్ కెప్పి తెలిపారు. అన్ని వేదికల వద్ద ఈ టికెట్లను కొనుగోలు చేయొచ్చని ఆయన చెప్పారు. ఆరు వేదికల్లో జరిగే వరల్డ్ కప్ అక్టోబరు 6న ఆరంభమవుతుంది.
కోల్‌కతాలో జరిగే పది మ్యాచ్‌లకు కలిపి రూ.480తో ప్యాకేజీగా అందిస్తామని... ఇందులో ఫైనల్ మ్యాచ్ టికెట్ కూడా ఉంటుందని కెప్పి అన్నారు. అండర్ 17 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications