Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు క్రికెట్ దిగ్గజాలు సచిన్, గంగూలీ

హైదరాబాద్: భారత్ తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ చివరిదశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడింయలో శనివారం (అక్టోబర్ 28)న ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా దిగ్గజ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లు హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి.

పైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తున్న సాల్ట్ లేక్ స్టేడియం ఇప్పటికే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దగ్గరుండి పర్వవేక్షిస్తోంది. ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించి ఏ దశ టోర్నీకైనా భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

దీంతో ఆ బాధ్యతలను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు ఫిఫా అధ్యక్షుడు, ఏఐఎఫ్ఎఫ్ సుప్రిమో ప్రపుల్ పటేల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు భారత పుట్‌బాల్ దిగ్గజాలు హాజరుకానున్నారు.

FIFA U-17 World Cup: Sourav Ganguly, Sachin Tendulkar expected to attend final

ఫిఫా అండర్‌-17కు సచిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో 'సచిన్‌తో కలిసి ఫైనల్‌ మ్యాచ్‌ను స్వయంగా వీక్షిస్తాను' అని గంగూలీ గురువారం మీడియాకు తెలిపాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌‌ని మట్టికరిపించి తొలిసారి ఇంగ్లాండ్ యు-17 ఫైనల్‌కు చేరింది.

బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో బ్రెజిల్ 3-1తో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఆటగాడు రియాన్ బ్రూస్టర్ రికార్డుస్థాయిలో రెండోసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించి తన జట్టును ఫైనల్ చేర్చాడు. దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు క్వార్టర్స్ కూడా చేరుకుని ఇంగ్లాండ్ జట్టు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+