Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా యు-17 వరల్డ్ కప్: హాజరులో చరిత్ర సృష్టించిన భారత్

హైదరాబాద్: భారత్ వేదికగా శనివారంతో ముగిసిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీ అరుదైన ఘనత సాధించింది. అండర్-17 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన టోర్నీగా 17వ ఎడిషన్ రికార్డు సృష్టించింది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో కలిపి మొత్తం టోర్నీకి 13,47,133 మంది హాజరయ్యారు.

ఇప్పటి వరకు జరిగిన 17 టోర్నీల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. 1985లో చైనాలో జరిగిన తొలి ఎడిషన్‌కు అత్యధికంగా 12,30,976 మంది హాజరయ్యారు. ఇప్పటిదాకా అదే రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును భారత ప్రేక్షకులు తిరగరాశారు. అప్పటికంటే అదనంగా 1,16,167 ప్రస్తుత టోర్నీని ప్రత్యక్షంగా చూడటం విశేషం.

FIFA U-17 World Cup in India becomes the most attended in event's history

ఇక, అండర్‌-20 ప్రపంచకప్‌ రికార్డు (13,09,929, కొలంబియా-2011)ను కూడా ప్రస్తుత టోర్నీ దాటేసింది. సీనియర్‌ స్థాయి కాకుండా ఏ వయసు విభాగంలోనైనా ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌లో కూడా ఇదే రికార్డు. మూడో స్థానం కోసం బ్రెజిల్, మాలి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో కలిపి మొత్తం హాజరు సంఖ్య 12,80,459.

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఇంగ్లండ్, స్పెయిన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు 66,674 మంది హాజరయ్యారు. ఈ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌ల్లో 177 గోల్స్‌ నమోదయ్యాయి. అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ అయిన టోర్నీ ఇదే. 2013 అమెకారిలో జరిగిన టోర్నీ 172 గోల్స్‌ రికార్డును ఈ టోర్నీ అధిగమించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+