హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆతిథ్య భారత్ తన పుట్‌బాల్ జట్టును ప్రకటించింది. అమర్‌జీత్ సింగ్ కెప్టెన్‌గా 21 మందితో కూడిన జట్టుని గురువారం ప్రకటించారు.
అక్టోబరు 6న ఢిల్లీలో భారత్-కొలంబియా మ్యాచ్‌తో ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 9న కొలంబియా, అక్టోబర్ 12న ఘనాతో భారత్ తలపడనుంది. భారత్‌తో పాటు గ్రూప్-ఎలో అమెరికా, ఘనా కూడా ఉన్నాయి.
భారత పుట్‌బాల్ జట్టు:
గోల్‌కీపర్లు: ధీరజ్ సింగ్, ప్రభ్‌సుఖాన్ గిల్, సన్నీ దలివాల్
డిఫెండర్లు: బోరిస్ సింగ్, జితేంద్ర సింగ్, అన్వర్ అలీ, సంజీవ్ స్టాలిన్, హెండ్రీ అంటనోవ్, నమిత్ దేశ్ పాండే;
మిడ్‌ఫీల్డర్లు: అమర్‌జీత్ సింగ్, సురేశ్ సింగ్, మీటేయ్, అభిజిత్ సర్కార్, కోమల్ తటాల్, లాలెంగ్‌మవియా, జీక్సన్ సింగ్, నాంగ్‌దంబా, రాహుల్ కన్లాయ్, మహ్మద్ షాజహాన్
ఫార్వర్డ్‌లు: రహీం అలీ, అనికేత్ జాదవ్