హైదరాబాద్: మనం ఎప్పుడైనా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ స్థానికంగా దేనికి ప్రత్యేకమో తెలుసుకుంటాం. ఎందుకంటే ఆ ప్రాంతానికి వచ్చామని గుర్తుగా ఏదైనా వస్తువుని కొనుగోలు చేస్తుంటాం. ఇలాంటి అలవాటు కామన్ మ్యాన్‌కే కాదు క్రీడాకారులు, సెలబ్రెటీలకు కూడా ఉంటుంది.
ప్రస్తుతం భారత్‌లో ఫిఫా ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది యువ సాకర్ ప్లేయర్లు వచ్చారు. అయితే, మ్యాచ్‌లు ముగిసిన తర్వాత స్ధానికంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలతో పాటు ఆయా ప్రాంతాల వంటకాలను గురించి తెలుసుకుంటాం.
అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆటగాళ్లను ఎప్పుడు పడితే అప్పుడు బయటిక పంపరు. దీంతో పలు దేశాలకు చెందిన ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా, నైగర్‌కు చెందిన ఆటగాళ్లు ఒక అడుగు ముందుకేసి మేనేజర్‌ను షాపింగ్‌కు వెళ్లాలని ఉందని అడిగారు.

దీంతో అతడు టీమ్ ప్రధాన కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌తో మాట్లాడి షరతులతో కూడిన అనుమతిని పొందాడు. ఆ అనుమతి కూడా కేవలం 60 నిమిషాలే. వెంటనే అందరూ షాపింగ్‌కు బయల్దేరారు. మేనేజర్ ఓ పెద్ద మాల్‌కు తీసుకెళ్లి గంట తర్వాత తిరిగి ఇదే పాయింట్ వద్దకు అందరూ రావాలి అని చెప్పాడు.
దీంతో ఆటగాళ్లు ఎవరి దారి వారు వెళ్లి షాపింగ్‌లో బిజీ అయిపోయారు. 20నిమిషాల్లో అందరూ షాపింగ్ ముగించేసుకుని మేనేజర్ చెప్పిన చోటికి వచ్చారు. అందరి చేతుల్లో బరువుగా పెద్ద పెద్ద కవర్లు ఉన్నాయి. చూసి ఉండబట్టలేక మేనేజర్ ఏం కొన్నారు అడిగాడు. అందులో ఏమున్నాయో తెలుసా? అరటికాయ చిప్స్.
ఒక్కో ఆటగాడు 5 కేజీల చొప్పున అరటికాయ చిప్స్ కొన్నారు. వారికి అంతలా నచ్చాయట. రూమ్‌కి తిరిగొచ్చాక చిప్స్‌ను చూసిన కోచ్ మ్యాచ్‌లు అయ్యే వరకు వాటిని తిన్నారో మీ పని చెబుతా అని హెచ్చరించాడు. దీంతో ఆటగాళ్లు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఏదైతేనేం తమకు కావల్సిన చిప్స్ దొరకడంతో ఆటగాళ్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.