హైదరాబాద్: భారత్ ఆతిథ్యమిస్తోన్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ట్రోఫీ, ఆతిథ్య సిటి లోగోను శనివారం ఆవిష్కరించారు. అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీకి దేశంలోని ఆరు ప్రధాన నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి.
టోర్నీలో భాగంగా గౌహతిలో ఒక సెమీఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిర్ణయించారు. అధికారికంగా విజేతకు అందించే ట్రోఫీని గోవా ముఖ్యమంత్రి శర్బానంద్ సోనావాల్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ట్రోఫీని అవిష్కరణ చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, యువతలో ఉత్సాహాన్ని మరింత రెట్టించేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందని అన్నారు.
టోర్నీ ఆవిష్కరణ కార్యక్రమంలో వరల్డ్ కప్ డైరక్టర్ జేవియర్ సెప్పీ పాల్గొన్నారు. గత వారం ఈ ట్రోఫీని న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్‌ఖ నేషనల్ స్టేడియం గేటు వద్ద ప్రదర్శనగా ఉంచారు. మొత్తం మీద 2.5లక్షల మంది ట్రోఫీని తిలకించినట్లు అంచనా, గౌహతి రెండో ఆతిథ్య నగరం కావడం గమనార్హం.