ఫిఫా వరల్డ్ కప్: నాకౌట్‌కు దూసుకెళ్లిన జర్మనీ, స్పెయిన్
హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో ఐరోపా పుట్‌బాల్ దిగ్గజాలైన జర్మనీ, స్పెయిన్‌లు నాకౌట్‌కు దూసుకెళ్లాయి. గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ ఓడి అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఈ రెండు జట్లు తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నాయి.

3-1తో గినియాపై జర్మనీ విజయం
గ్రూప్-సిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 3-1తో గినియాపై విజయం సాధించింది. జర్మనీ తరుపున కెప్టెన్ జన్-ఫైటీ అర్స్ (8వ నిమిషం), నికోలస్ కుయెహ్ (62వ), షవెర్డి సీటిన్ (90వ) గోల్స్ సాధించగా... గినియా తరఫున ఇబ్రహిమ సౌమా (26వ) ఒకే ఒక్క గోల్ చేశాడు.

6 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన జర్మనీ
మొత్తం 6 ఆరు పాయింట్లతో గ్రూప్ సిలో రెండో స్థానంతో జర్మనీ నాకౌట్ బెర్త్‌ని ఖరారు చేసుకుంది. ప్రీ క్వార్టర్స్‌లో గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచిన కొలంబియాతో జర్మనీ తలపడనుంది. మరో మ్యాచ్‌లో ఇరాన్ 3-0తో కోస్టారికాపై ఘన విజయం సాధించింది.

9 పాయింట్లతో అగ్రస్ధానంలో ఇరాన్
మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఇరాన్.. మొత్తం 9 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇరాన్ తరఫున గోబిషవి (25వ), షరియాతి (29వ), సర్దారీ (89వ) గోల్స్ చేశారు. ఇదిలా ఉంటే ఓటమితో గునియా, కోస్టారికా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఉత్తర కొరియాపై 2-0తో స్పెయిన్ విజయం
ఇక, ఉత్తర కొరియాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 2-0తో విజయం సాధించింది. తాజా విజయంతో స్పెయిన్ రెండు విజయాల నుంచి 6 పాయింట్లతో గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచింది. శనివారంతో గ్రూప్ దశ ముగియనుంది. ఆఖరి రోజు ఫ్రాన్స్‌తో హోండురస్.. జపాన్‌తో న్యూ కలెడోనియా.. మెక్సికోతో చిలీ.. ఇంగ్లాండ్‌తో ఇరాక్ తలపడతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications