న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA U-17 World Cup: భారత్‌ ఓటమి, 3-0తో అమెరికా విజయం

తొలిసారి ఓ ఫిఫా మెగా టోర్నీలో భారత్ కుర్రాళ్లు నిరాశపరిచారు. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమేమీ జరగలేదు.

By Nageshwara Rao

హైదరాబాద్: తొలిసారి ఓ ఫిఫా మెగా టోర్నీలో భారత్ కుర్రాళ్లు నిరాశపరిచారు. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమేమీ జరగలేదు. గ్రూప్‌ 'ఎ'లో భాగంగా శుక్రవారం అమెరికా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 0-3తో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమి ఊహించిందే కావడం విశేషం.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే అమెరికా హవా కొనసాగినప్పటికీ, భారత ఆటగాళ్లు అనికేత్‌ జాదవ్, అన్వర్‌ అలీ, కోమల్‌ తటాల్‌లు మెరుగైన ఆటను ప్రదర్శించారు. అలాగే గోల్‌ కీపర్‌ ధీరజ్‌ అప్రమత్తంగా ఉండటంతో అమెరికా పలు గోల్స్‌ అవకాశాలను పోగొట్టుకుంది. అమెరికా తరుపున సార్జెంట్‌ (30వ నిమిషంలో, పెనాల్టీ కిక్‌), డర్కిన్‌ (51వ), కార్ల్‌టన్‌ (84వ) గోల్స్‌ చేశారు.

 అమెరికా బోణీ

అమెరికా బోణీ

ఆట ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే అమెరికా జట్టు బోణీ చేసేలా కనిపించింది. అయితే సార్జెంట్‌ కొట్టిన ఈ షాట్‌ నేరుగా భారత గోల్‌ కీపర్‌ ధీరజ్‌ చేతుల్లోకి వెళ్లింది. తొలి పది నిమిషాలు పూర్తిగా అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు తమలో తాము బంతిని పాస్‌ చేసుకుంటూ భారత ఆటగాళ్లను ఏమార్చారు. 25వ నిమిషంలో భారత్‌కు తొలి కార్నర్‌ అవకాశం దక్కినా ఫలితం లేకపోయింది.

 డిఫెన్స్‌కే పరిమితమైన భారత్

డిఫెన్స్‌కే పరిమితమైన భారత్

మ్యాచ్‌ ఆసాంతం భారత్‌ డిఫెన్స్‌కే పరిమితమైంది. గోల్స్‌ చేసేందుకు అమెరికా అనేక అవకాశాలు సృష్టించుకుంటే.. భారత్‌కు మాత్రం స్పష్టమైన అవకాశాలు రెండే వచ్చాయి. పాసుల్లో కచ్చితత్వంతో ఆరంభం నుంచే అమెరికా దూకుడు ప్రదర్శించింది. భారత్‌కు ఎంత సేపటికీ ఆ జట్టును అందుకోవడానికే సరిపోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన 23 నిమిషాల వరకు భారత్‌... అమెరికా గోల్‌పోస్టు దరిదాపుల వరకు కూడా వెళ్లలేకపోయింది.

 30వ నిమిషంలో అమెరికా తొలి గోల్

30వ నిమిషంలో అమెరికా తొలి గోల్

మరోవైపు 30వ నిమిషంలో అమెరికా పెనాల్టీ కిక్‌ ద్వారా తొలి గోల్‌ను సాధించి మ్యాచ్‌లో ఆధిక్యాన్ని సాధించింది. జోష్‌ సార్జెంట్‌ను బాక్స్‌లో జితేంద్ర సింగ్‌ అడ్డుకుని కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ అవకాశాన్నిచ్చాడు. దీంతో సార్జెంట్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. ప్రత్యర్థి వరుస దాడులు చేస్తుంటే భారత్‌ ఎక్కువ సమయం తన అర్ధభాగానికే పరిమితమైంది.

 ఒత్తిడిలో భారత డిఫెన్స్‌ను

ఒత్తిడిలో భారత డిఫెన్స్‌ను

అమెరికా ఎటాకింగ్‌ త్రయం సర్గెంట్‌, టిమ్‌ వీ, అకినోలాలు ఎప్పుడూ భారత డిఫెన్స్‌ను ఒత్తిడిలోనే ఉంచారు. దీంతో తొలి అర్థభాగం మరో 15 నిమిషాల్లో ముగుస్తుందనగా భారత ఆటగాళ్లు కొన్ని అవకాశాలు సృష్టించుకోగలిగారు. భారత్ తరుపున ముఖ్యంగా కోమల్‌ తటాల్‌ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకోగలిగినా జట్టు సహచరుల నుంచి సహకారం లభించలేదు.

 42వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం

42వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం

42వ నిమిషంలో భారత్‌ నుంచి తొలిసారిగా అనికేత్‌ గోల్‌ కోసం ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఇక రెండో అర్ధభాగంలో అమెరికా దూకుడుకు భారత్‌ బ్రేక్ వేసింది. 49వ నిమిషంలో కార్ల్‌టన్‌ అద్భుత కిక్‌ను గోల్‌ కీపర్‌ ధీరజ్‌ అడ్డుకున్నాడు. అయితే 50వ నిమిషంలో గోల్ చేయడం ద్వారా మ్యాచ్‌లో అమెరికా 2-0 ఆధిక్యాన్ని సాధించింది.

84వ నిమిషంలో అమెరికా మరో గోల్

84వ నిమిషంలో అమెరికా మరో గోల్

ఇదిలా ఉంటే 55వ నిమిషంలో భారత్‌కు గోల్‌ చేసే అవకాశం చిక్కింది. కానీ కోమల్‌ తటాల్‌ అంచనా తప్పి కాస్త ఎక్కువ శక్తిని ఉపయోగించడంతో బంతి గోల్‌ పోస్టు పైనుంచి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో అమెరికా మరోసారి గోల్ చేసింది. కార్ల్‌టన్‌ పిచ్‌ మధ్య నుంచి బంతిని తన స్వాధీనంలో ఉంచుకుంటూ గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టించి చేసిన గోల్‌తో అమెరికా 3-0తో మ్యాచ్‌లో విజయాన్ని సాధించింది.

 ఘనా, పరాగ్వే విజయం

ఘనా, పరాగ్వే విజయం

శుక్రవారం జరిగిన మరో మ్యాచ్‌ల్లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘ఎ'లో ముందుగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఘనా 1-0తో కొలంబియాపై గెలిచింది. గ్రూప్‌ ‘బి'లో న్యూజిలాండ్, టర్కీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఇదే గ్రూప్‌లో పరాగ్వే 3-2తో మాలిపై గెలిచింది. ఇక, శనివారం జరిగే మ్యాచుల్లో జర్మనీతో కోస్టారికా, ఇరాన్‌తో గినియా, బ్రెజిల్‌తో స్పెయిన్‌, ఉత్తర కొరియాతో నైజర్‌ తలపడతాయి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X