న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: వరుసగా బ్రెజిల్‌కు మూడో విజయం

ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గ్రూప్ డిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో నైగర్‌ను ఓడించింది. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గ్రూప్ డిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో నైగర్‌ను ఓడించింది.

మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ మ్యాచ్ ఆరంభం నుంచే తన దూకుడుని ప్రదర్శించింది. మ్యాచ్‌ ఆరంభమైన నాలుగో నిమిషంలోనే బ్రెజిల్‌ స్ట్రయికర్‌ లింకోల్న్‌ గోల్‌ సాధించాడు. ఆ తర్వాత 34వ నిమిషంలో ఫార్వర్డ్‌ బ్రెన్నర్‌ మరో గోల్‌ చేసి బ్రెజిల్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.

 FIFA U-17 World Cup: Brazil beat Niger 2-0, finish top with all-win record

తాజా విజయంతో బ్రెజిల్‌ 9 పాయింట్లతో అగ్రస్థానంతో గ్రూప్‌ దశను ముగించింది. ఈ టోర్నీలో శనివారంతో గ్రూప్‌ దశ ముగియనుంది. ఇదిలా ఉంటే ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో స్పెయిన్‌ 2-0తో ఉత్తర కొరియాపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో చివరి రోజైన శనివారం ఫ్రాన్స్‌తో హోండురస్‌.. జపాన్‌తో న్యూ కలెడోనియా.. మెక్సికోతో చిలీ.. ఇంగ్లాండ్‌తో ఇరాక్‌ తలపడనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X