Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువతకు మంచి అవకాశం: ఫిఫా వరల్డ్ కప్‌పై మోడీ

హైదరాబాద్: భారత్ దేశం తొలిసారి ఆతిథ్యమిస్తున్న అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ దేశ యువతకు మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అక్టోబర్ 6న మొదలవుతున్న ఈ ఫుట్‌బాల్ మెగా ఈవెంట్‌లో అందరూ భాగస్వామ్యులు కావాలని పీఎంవో అధికారిక ట్విట్టర్‌లో మోడీ పిలుపునిచ్చారు.

ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన 36వ మన్ కీ బాత్ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. 'నా దేశ పౌరులారా రానున్న ఫిఫా ప్రపంచకప్ మన యువతకు మంచి అవకాశం. నవరాత్రి పర్వదినం, దీపావళీ పండుగల మధ్య ప్రపంచకప్ జరుగబోతోంది. దేశం నలుమూలల ఫుట్‌బాల్ ఆట పట్ల స్ఫూర్తి వ్యాపిస్తుంది' అని ప్రధాని అన్నారు.

'ప్రపంచం మొత్తం భారత గడ్డపై ఆడేందుకు వస్తోంది. క్రీడలు మన జీవితంలో భాగమని నిరూపిద్దాం' అని ప్రధాని మోడీ అన్నారు. అక్టోబర్ నెలలో ఆరంభం కానున్న 17వ ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో ఆతిథ్య భారత్‌తో సహా మొత్తం 24 జట్లు బరిలో ఉన్నాయి. మొత్తం ఆరు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో తలపడుతున్నాయి.

ఏయే జట్లు ఏయే గ్రూపులో:
గ్రూప్ A: India, USA, Colombia, Ghana;
గ్రూప్ B: Paraguay, Mali, New Zealand, Turkey;
గ్రూప్ C: Iran, Guinea, Germany, Costa Rica;
గ్రూప్ D: North Korea, Niger, Brazil, Spain;
గ్రూప్ E: Honduras, Japan, New Caledonia, France;
గ్రూప్ F: Iraq, Mexico, Chile, England

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+