Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: ఖతార్‌లో ఫిఫా మానవ హక్కుల ఉల్లంఘన

ఆమ్‌స్టర్‌డాం: ప్రాథమిక మానవ హక్కులు, వలస కార్మికుల హక్కులను కాపాడుతామని హామీ ఇవ్వక ముందే 2022లో వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్‌ను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) ఎంపికచేసిందని నెదర్లాండ్స్ ట్రేడ్ యూనియన్ కాన్ఫిడరేషన్ (ఎఫ్ఎన్‌వి) ఆరోపిస్తోంది. కఫాలా వ్యవస్థను కూడా ఖతార్ రద్దుచేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది.

ఈ విషయమై ఫిఫాకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగనున్నట్లు తెలిపింది. ఖతార్ వరల్డ్ కప్ 2022 నిర్వాహక వేదికల నిర్మాణంలో పాల్గొంటున్న వర్కర్ల పీడనలో ఫిఫా భాగస్వామ్యం కలిగి ఉన్నదని పేర్కొంటూ స్విస్ న్యాయస్థానంలో ఎఫ్ఎన్ వి తరఫున పిటిషన్ దాఖలుచేసింది.

బంగ్లాదేశీ వలస కార్మికుడు నదీమ్ షారాఫుల్ ఆలంకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరితే అందుకు ఖతార్ ప్రభుత్వం నిరాకరించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై వివరాలు తెలియజేయాలని ఫిఫాను స్విస్ న్యాయస్థానం కోరిందని గార్డియన్ దినపత్రిక ఓ వార్తాకథనం ప్రచురించింది.

ఎఫ్ఎన్‌వి గత అక్టోబర్‌లో ఆలంకు పరిహారం చెల్లింపుల విషయమై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినోకు గత అక్టోబర్ ప్రారంభంలో లేఖ రాసినప్పుడు సంక్లిష్ట పరిస్థితేనని అంగీకరించిన అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం మూడు వారాల్లో పరిహారం చెల్లిస్తామని హామీనిచ్చింది. కానీ ఆచరణలో ఈ విషయాన్నే మరిచిపోయింది.

ఒకవేళ ఆలంకు పరిహారం చెల్లించేందుకు ఫిఫా ముందుకు వస్తే చట్టబద్ధంగా పలువురు వర్కర్లు తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నదని సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై ఫిఫా బహిరంగంగా స్పందించేందుకు ఫిఫా నిరాకరిస్తున్నది.

జవాబుదారీ లేదని తోసిపుచ్చిన ఫిఫా

జవాబుదారీ లేదని తోసిపుచ్చిన ఫిఫా

అదే సమయంలో వరల్డ్ కప్ నిర్వాహక వేదికల నిర్మాణ స్థలాల వద్ద జీవన, శ్రామిక పరిస్థితులతో తనకు ఎటువంటి బాధ్యత, జవాబుదారీ లేదని తోసిపుచ్చుతున్నది. ఇదంతా ఆతిథ్య దేశాలకు మాత్రమే చెందుతుందని వాదిస్తున్నది. ఇటీవలి కాలంలో ఖతార్ వ్యవహార శైలిపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 2022లో వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమైన స్టేడియంల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పట్ల ఖతార్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నాయి.

ఇఫిఎల్‌లో మాంఛెస్టర్ యునైటెడ్ లక్ష్యం టాప్ 4

ఇఫిఎల్‌లో మాంఛెస్టర్ యునైటెడ్ లక్ష్యం టాప్ 4

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీలో టాప్ 4లో నిలబడటమే తమ ముందు ఉన్న లక్ష్యమని మాంఛెస్టర్ యునైటెడ్ లెజెండ్ ప్లేయర్ వైట్ యార్కె అన్నాడు. ‘టాప్ 4లో చోటు దక్కించుకునేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నా' అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియాతో చెప్పాడు. 1998 - 99లో ఇపిఎల్ టోర్నీ ట్రోఫిని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన యార్కె.. తమకు జోస్ మౌరిన్హో వంటి మంచి మేనేజర్ అందుబాటులో ఉన్నాడని పేర్కొన్నాడు. ఆయన తమ టీంను టాప్‌లోకి తీసుకెళ్లగలడని తనకు విశ్వాసం ఉన్నదన్నాడు.

యునైటెడ్ జట్టులో అత్యధిక లీగ్ స్కోరర్‌గా యార్కె

యునైటెడ్ జట్టులో అత్యధిక లీగ్ స్కోరర్‌గా యార్కె

ఇంతకుముందు కోచ్ అలెక్స్ ఫెర్గూసన్ సారధ్యంలో యునైటెడ్ జట్టులో అత్యధిక లీగ్ స్కోరర్‌గా యార్కె నిలిచాడు. మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు సామర్థ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో అలెక్స్ ఫెర్గూసన్ వైదొలిగాడు. ప్రస్తుతం ఇపిఎల్ పాయింట్ల పట్టికలో మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 21 పాయింట్లతో ఆరో స్థానంలో స్థిరపడగా, లీగ్ లీడర్‌గా ఉన్న చెల్సియా 13 పాయింట్లు తర్వాతీ స్థానంలో నిలిచింది. అలెక్స్ వైదొలిగిన తర్వాత కష్టతరంగా మారిందన్నాడు. మాంఛెస్టర్ యునైటెడ్ గ్లోబల్ ప్రచారకర్తగా యార్కె తమకు ప్రత్యేకించి డేవిడ్ మోయెస్, లూయిస్ వాన్ గాల్‌లకు ఇంగ్లండ్‌తోపాటు అంతర్జాతీయ టోర్నీల్లో అంచనాలను అందుకోలేకపోవడం ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పాడు.

భారత్ ఫుట్ బాల్కు సేవలు

భారత్ ఫుట్ బాల్కు సేవలు

ఇంతకుముందు సెషన్‌లో లూయిస్ వాన్ గాల్ సారధ్యంలో ఫుట్ బాల్ అసోసియేషన్ (ఎఫ్ఎ) కప్‌ను గెలుచుకోగలిగామన్నాడు. ఎఫ్ఎ టైటిల్ గెలుచుకోవడం సత్ఫరిణామమేనని, ప్రస్తుతం తాము కష్టకాలంలో ఉన్నామని, అయితే జోస్ మౌరిన్హో శిక్షణలో తమ జట్టు తిరిగి ఎగసి పడుతుందని విశ్వాసం ఉందన్నాడు. ఇదిలా ఉంటే స్వీడిష్ ఫుట్ బాల్, మాంఛెస్టర్ యునైటెడ్ ప్లేయర్ బోజన్ జోర్డిజిక్ మాట్లాడుతూ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు వారు పొందుతున్న పారితోషికం కంటే ఎక్కువగానే భారత్ ఫుట్ బాల్ కు సేవలందిస్తున్నారన్నాడు. వారి శక్తి సామర్థ్యాల మేరకే ఐఎస్ఎల్‌లో భాగస్వాములయ్యారే గానీ కేవలం పారితోషికం కోసం కాదన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+