ఫోటోలు: రంగంలోకి స్టార్ ప్లేయర్లు, హోరెత్తిన ప్రచారం
మాస్కో: మరింత చురుగ్గా రష్యాలో 2018లో జరిగే వరల్డ్ కప్ టోర్నీని ప్రోత్సహిస్తూ ప్రచారం రేకెత్తించాలని ఫిఫా భావిస్తున్నది. అందుకు వాణిజ్య ప్రకటనలో పేరొందిన స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లను వినియోగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం టోర్నమెంట్ క్వాలిఫయింగ్ మార్చ్‌లను అందుకు వేదికగా మార్చుకోవాలని ఉద్దేశంతో ఉంది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి విటలే ముత్కో ధ్రువీకరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్‌ఫాంటినోతో సమావేశం కానున్నారు. త్వరలో జరిగే ఫిఫా కాన్ఫిడరేషన్ కప్ టోర్నీ మ్యాచ్‌ల డ్రా తీసేందుకు కజన్ లో ఇన్ ఫాంటినో పర్యటిస్తారు. పుతిన్‌ను ఫిఫా అధ్యక్షుడు ఇన్ ఫాంటినో అధికారికంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. వరల్డ్ కప్ సన్నాహక ఏర్పాట్లపై వారిద్దరూ చర్చించుకోనున్నారు. వచ్చే ఏడాది జూన్ 17 నుంచి జూలై రెండో తేదీ వరకు ఫిఫా కాన్పిడరేషన్ కప్ సాగుతుంది.
దాని కొనసాగింపుగా 2018లో వరల్డ్ కప్ సాగుతుంది. ఫిఫా కాన్ఫిడరేషన్ కప్, వరల్డ్ కప్‌లకు రష్యా ఆతిథ్యం ఇవ్వనున్నది. 'మేం ఇన్ ఫాంటినో నుంచి ప్రశ్నావళి కోసం వేచి చూస్తున్నాం. మేం కూడా ఆయన ద్వారా కొన్ని సందేహాలు నివ్రుత్తి చేసుకోవాల్సి ఉంది. మేం కూడా ఫిఫా మాదిరిగానే ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీకి స్టార్ ఆటగాళ్ల సాయంతో ప్రోత్సాహంతో కూడిన ప్రచారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని ముట్కో తెలిపారు.

చెల్సియా' విలియాన్‌వైపు మాంఛెస్టర్ యునైటెడ్ చూపు
చెల్సియా క్లబ్ ఫుట్‌బాల్ ఆటగాడు విలియాన్‌ను తమ జట్టు కోచ్‌గా నియమించుకునేందుకు మాంఛెస్టర్ యునైటెడ్ క్లబ్ యాజమాన్యం ఉవ్విళ్లూరుతున్నది. ఇందుకోసం 25 మిలియన్ల పౌండ్లు (31.1 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నది. వచ్చే జనవరిలో విలియాన్‌తో కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా జోస్ మౌరిన్హోతో కలిసి విలియాన్ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

మౌరిన్హోతో కలిసి కీలక పాత్ర
2014-15లో చెల్సియా టీం చాంపియన్స్ టోర్నీ గెలుచుకోవడంలో విలియాన్.. మౌరిన్హోతో కలిసి కీలక పాత్ర పోషించాడు. మారిన్హోను గత సీజన్ మధ్యలోనే చెల్సియా మధ్యలోనే సాగనంపింది. దీనికి కారణం గతేడాది డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ కాపాడుకోవడంలో విఫలమైనందుకే మౌరిన్హోను చెల్సియా నుంచి సాగనంపినట్లు తెలుస్తున్నది. కానీ చెల్సియా కొత్త కోచ్ ఆంటోనియో కాంటే సారధ్యంలో విలియాన్ పూర్తిగా జట్టుకు బయట ఉంటున్నాడు.

మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు పునర్నిర్మాణం
ఇటాలియన్ కోచ్ స్పెయిన్‌యార్డ్ పెడ్రో రోడ్రిగెజ్ సారధ్యంలో ముగ్గురు సభ్యుల డిఫెన్సివ్ వ్యవస్థను రూపొందించాడు. ఈ నేపథ్యంలో చెల్సియా ప్లేయర్‌గా విలియాన్ అత్యున్నత స్థాయిలో ప్రతిభా పాటవాలు గల ప్లేయర్ అని మౌరిన్హో తెలిపాడు. ప్రీ రన్నింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడని చెప్పాడు. ఆయన రాకతో మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలడని మౌరిన్హో వివరించాడు. జనవరిలో బ్యాక్ లైన్‌కు ప్రాధాన్యం ఇస్తూ మిడ్ సీజన్‌ను బలోపేతంచేయాలన్నది మౌరిన్హో వ్యూహంగా కనిపిస్తున్నది.

ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ అలెక్సాండర్ డ్రాజోవిక్
మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు బలోపేతానికి సౌతాంప్టన్ జంట జోస్ ఫాంటే, వర్జిల్ వాన్ డిజ్క్, బెన్‌ఫికా యంగ్ స్వీడిష్ స్టార్ విక్టర్ లిండోల్ఫ్, బేయర్ లివర్‌కుసెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ అలెక్సాండర్ డ్రాజోవిక్‌లను జట్టులోకి తీసుకొచ్చేందుకు మౌరిన్హో ద్రుష్టి సారించాడు. జట్టును ప్రభావిత స్థాయికి తీర్చిదిద్దేందుకు తనకు కొంత గడువు కావాలని మౌరిన్హో తెలిపాడు. ఫలితాలు సాధించడం ఒక్కటే ముఖ్యం కాదని, జట్టు ఆట తీరు మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టు ఎప్పుడెలా ఆడుతుందో ఊహించడం కష్ట సాధ్యమని ఆయన వ్యాఖ్యానించాడు. బిగ్ క్లబ్ పెద్ద చరిత్ర ఉన్నందున సత్ఫలితాలను కోరుకోవడం సహజమేనన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications