Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమిష్టి కృషి వల్లే సాధ్యం: భారత ర్యాంకుపై కోచ్

న్యూఢిల్లీ: కాగా, ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మెరుగైన స్థానానికి చేరుకోవడంపై జట్టు కోచ్ స్టీఫెన్ కాంస్టాటైన్ మాట్లాడుతూ ఇది గర్వ కారణమైనా.. చేరుకోవాల్సిన స్థానాన్ని అందుకోలేదని వ్యాఖ్యానించాడు. 'నేను జట్టుకు రెండోసారి శిక్షకుడిగా వచ్చినప్పటి నుంచి ఫిఫాలో భారత్ జట్టు ర్యాంకింగ్ మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు అనుగుణంగా వచ్చిన ఫలితాలతో విజయం సాధించామని రుజువైంది' అని కాంస్టాటైన్ చెప్పారు.

'ఇది పూర్తిగా జట్టు సమిష్ఠి క్రుషి వల్ల సాధ్యమైంది. అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రఫుల్ పటేల్, కుశాల్ దాస్ లు నన్ను అనుమతించకపోతే అనుకున్న లక్షాలు సాధించగలిగే వారం కాదు' అని నొక్కి వక్కాణించారు. కానీ భారత ఫుట్ బాల్ ను ప్రగతి బాట పట్టించేందుకు ఇది సుదీర్ఘ ప్రణాళికలో కేవలం ప్రారంభం మాత్రమేనని స్పష్టంచేశాడు. భారత జట్టు మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

కాంస్టాటైన్ జాతీయ కోచ్ గా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి నియమితులైనప్పుడు ఫిఫా ర్యాంకింగ్ లో బారత జట్టు స్థానం 171 నుంచి మార్చిలో 173కు పడిపోయింది. అంతకుముందు నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో కాంటాస్టైన్ సారధ్యంలో 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించినా ప్రయోజనం లేకపోయింది. అయితే జట్టులో సగటు ప్లేయర్ వయస్సు 32 ఏళ్ల నుంచి 24 ఏళ్లకు తగ్గించిన తర్వాతే జట్టు ర్యాంకింగ్ లో మార్పు కనిపించిందని కాంస్టాటైన్ వ్యాఖ్యానించాడు.

'మా టీం వైపు మీరు ద్రుష్టి సారిస్తే ఎఐఎఫ్ఎఫ్ అకాడమీలు ఇదే ప్రతిపాదనను సెట్ చేస్తాయి. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఎఐఎఫ్ఎఫ్ యూత్ డెవలప్మెంట్ సెటప్ లో యూత్ ను అధికంగా ప్రవేశ పెడుతున్నాం' అని అన్నాడు. ఎఎఫ్ సి టోర్నీలో ఫైనల్స్ కు దూసుకెళ్లిన బెంగళూర్ క్లబ్ జట్టును కాంస్టాటైన్ అభినందించాడు. ఈ ఫలితం భారత పుట్ బాల్ పరిస్థితి మెరుగు పడుతుందనడానికి సంకేతామని చెప్పాడు.

FIFA rankings india: Coach stephen constantine response

పట్టు కోసం జట్ల మధ్య పెరుగుతున్న పోటీ

ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లింగ్ అనుభూతి మిగిల్చినా దానికి కారణం డైనమోస్ కుర్రాడు మార్సెలిన్హో ఐఎస్ఎల్ లో 350వ గోల్ చేసిన రికార్డు సొంతంచేసుకున్నాడు. ఈ సీజన్ లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మూడో గోల్ చేయడంతో ఫలితం డ్రాగా ముగిసింది.

తొలి రెండు ఎడిషన్ల కంటే ఈ దఫా ఐఎస్ఎల్ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లలో ఫలితం డ్రాగా ముగిసింది. దీని ఫలితంగా 2014 నుంచి 2015 మీదుగా ఈ ఏడాది ఎడిషన్‌లో 17 లీగ్ మ్యాచ్‌లలో సగటు గోల్స్ నిష్పత్తి 2.05 నుంచి 0.53 ఆ తర్వాత 0.36 శాతం తగ్గుముఖం పట్టింది.

ఆయా జట్లు తమను తాము రక్షించుకునేందుకు పోరాడుతుండటంతో వాటి లీడ్ కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. ముంబై, ఢిల్లీ మధ్య మ్యాచ్ డ్రాగా ముగియడమే దీనికి నిదర్శనం. ముంబై జట్టు ఫస్టాఫ్ లోనే 2 - 0 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించింది.

రెండో హాఫ్ 69వ నిమిషంలో అది 3-1 లీడ్‌గా మారింది. అయినా అలెగ్జాండ్రీ గుమారెస్ కుర్రాళ్లు కాలంతో సమానంగా పోటీ పడటంలో వెనుకంజ వేయడం వల్లే మ్యాచ్ డ్రా మారింది. అంతే కాదు. తొలి 17 మ్యాచ్ లలో ఏడు డ్రాగా ముగియడం ఆసక్తికర పరిణామం.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+