హైదరాబాద్: ఏడాది పొడవునా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, వాటి ఫలితాలను ఆధారంగా చేసుకుని ఫిఫా ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో జర్మనీ అజేయంగా దూసుకుపోతుంది. ఈ మధ్యనే జరిగిన ప్రధాన ప్రత్యర్థి రష్యాను ఓడించడంతో పాటు ఇంకొన్ని వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
🇩🇪Germany are the #FIFARanking’s latest ‘Team of the Year’, having ended 2017 atop the global ladder 💪
— FIFA.com (@FIFAcom) December 21, 2017
More 👉 https://t.co/Yfb7qexnMz pic.twitter.com/qFr8pLENfz
మొత్తం పదిహేను జట్టులతో తలపడి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని మొదటి ర్యాంకును సంపాదించుకోగలగింది. టాప్ స్పీడులో దూసుకుపోతున్న అర్జెంటీనా, బెల్జియం జట్టులను సైతం ఓడించింది. ఇందుకుగాను 2015, 2016 సంవత్సరాలకు 'టీమ్ ఆఫ్ ద ఇయర్' టైటిల్ ను సొంతం చేసుకుంది.
జర్మనీ ఖాతాలో 41పాయింట్లు ఉండగా, ప్రస్తుత ర్యాంకింగ్ ను బట్టి దానిని ఇంటర్నేషనల్ టీం ఏ కేటగిరిగా పరిగణించారు. మొదటి మూడు స్థానాల్లో జర్మనీ, బ్రెజిల్, పోర్చుగల్ ఉన్నాయి. సునీల్ చెత్రి సారథ్యం వహిస్తున్న భారత్ జట్టు 105వ స్థానంలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.