Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

137: ఆరేళ్లకు మళ్లీ అత్యుత్తమ ర్యాంకుకు భారత పుట్‌బాల్ జట్టు

న్యూఢిల్లీ: భారత్ పుట్‌బాల్ జట్టు ర్యాంకుల్లో అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు గత ఆరేళ్లలో అత్యుత్తమ ర్యాంకును అందుకుంది. తాజాగా గురువారం వెల్లడించిన ఫిఫా ర్యాంకుల్లో భారత్ 11 స్ధానాలను ఎగబాకి 137వ ర్యాంకుకు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 114వ ర్యాంక్‌లో ఉన్న ప్యూర్టోరికోను ఓడించింది. దీంతో భారత్‌కు 230 రేటింగ్‌ పాయింట్లు లభించాయి. దీంతో ఫిఫా తాజా ర్యాంకుల్లో భారత్‌ 137వ స్థానానికి చేరుకుంది. 2010 ఆగస్టులో తొలిసారిగా తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు (137)ను సాధించింది.

FIFA Ranking: India Rise to 137, Their Best-Ever in Six Years

మళ్లీ భారత్‌కు మరోసారి ఈ ర్యాంకు లభించింది. భారత్ ర్యాంకుపై కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ సంతోషం వ్యక్తం చేశారు. భారత జట్టు ర్యాంకు మెరుగుపడటంలో జట్టు సమిష్టి కృషి ఉందని అన్నారు. తాను రెండోసారి జట్టు కోచ్‌గా ఎంపికైన తర్వాత జట్టు ర్యాంకు మెరుగుపరచాలని భావించానని, ఇప్పుడు అది నెరవేరిందని చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో కాన్‌స్టాంటైన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు జట్టు ర్యాంకు 173గా ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+