For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొరాకోలో సాకర్ వసతులపై ఫిఫా పెదవి విరుపు! మరో తనిఖీకి హెచ్చరిక!!

FIFA questions Morocco stadium quality after surprise inspection of infrastructure

కాసాబ్లాంకా: మరో ఎనిమిదేళ్లలో 2026 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేసిన మొరాకోలో స్టేడియంల నాణ్యత, మౌలిక వసతుల కల్పనపై ఫిఫా తనిఖీ టీం పెదవి విరిచింది. స్టేడియంల నాణ్యతపై సందేహాలు లేవనెత్తింది. తదుపరి అకస్మిక తనిఖీలు చేసేలోగా మౌలిక వసతులు మరింత మెరుగు పడాలని ఆకాంక్షించింది ఫిఫా తనిఖీ టీం.

వసతుల అవసరం ఉందన్న మొరాకో బిడ్ కమిటీ అధ్యక్షుడు:

వసతుల అవసరం ఉందన్న మొరాకో బిడ్ కమిటీ అధ్యక్షుడు:

మొరాకో సాకర్ బిడ్ ప్రెసిడెంట్ మౌలే హఫీద్ ఎలాలామీ ఇప్పటికీ ఫుట్ బాల్ మ్యాచుల నిర్వహణకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నదని తమకు తెలుసునన్నారు. జూన్ నెలలో అమెరికా - మెక్సికో - కెనడా దేశాలతో కూడిన కూటమికి వ్యతిరేకంగా బిడ్ దాఖలు చేసిన మొరాకో బిడ్ కమిటీ నెల రోజుల క్రితమే బిడ్ సమర్పించింది.

 మొరాకో స్టేడియంలు, ఇతర వసతులు పరిశీలించిన ఫిఫా టీం

మొరాకో స్టేడియంలు, ఇతర వసతులు పరిశీలించిన ఫిఫా టీం

ఈ నేపథ్యంలో జ్యురిచ్‌లో గల ఫిఫా హెడ్ క్వార్టర్ నుంచి మొరాకోలో ఫుట్ బాల్ నిర్వహించడానికి అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? అన్న విషయమై మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించేందుకు ఒక టీమ్‌ను పంపింది. ఈ టీం మారాకెచ్, అగదిర్, టాంగియర్, కాసాబ్లాంకా నగరాల్లోని స్టేడియంలు, హోటళ్లు, శిక్షణా శిబిరాలు, ఇతర ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహక ప్రదేశాలను తనిఖీ చేసింది.

త్వరలో హోటళ్లలో వసతుల కల్పనపై ఫిఫా నజర్

త్వరలో హోటళ్లలో వసతుల కల్పనపై ఫిఫా నజర్

కానీ మరో ఫిఫా నిపుణుల కమిటీ త్వరలో వీఐపీలకు అవసరమైన వసతులు ఉన్నాయా? లేదా? అన్న విషయమై మొరాకోలోని హోటళ్లలో తనిఖీలు చేపట్టనున్నదని ఎలాలామీ తెలిపారు. ఫిఫా అధికారులు స్టేడియంల్లో వసతుల కల్పనపై కొన్ని సూచనలు చేశారని మొరాకో సాకర్ కప్ బిడ్ కమిటీ అధ్యక్షుడు ఎలాలామీ తెలిపారు. దీనికి పరిష్కార మార్గం కనుగొనేందుకు ఫిఫా అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు.

వసతుల కల్పనకు మొరాకోకు 1600 కోట్ల డాలర్లు కావాలి

వసతుల కల్పనకు మొరాకోకు 1600 కోట్ల డాలర్లు కావాలి

48 జట్లతో కూడిన వరల్డ్ కప్ నిర్వహణ కోసం మౌలిక వసతులు కల్పించేందుకు మొరాకోకు 1600 కోట్ల డాలర్ల నిధులు అవసరం. కొత్తగా స్టేడియంల నిర్మాణం, ఉన్న 14 స్టేడియంలకు మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని మొరాకో ఫిఫా వరల్డ్ కప్ బిడ్ కమిటీ అధ్యక్షుడు మౌలే హఫీద్ ఎలాలామీ చెప్పారు. కానీ దీనికి ప్రతిగా ఉత్తర అమెరికా దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో దేశాల కూటమి ‘సాకర్' కప్ నిర్వహణకు ఎటువంటి అదనపు వసతులు ఇప్పటికిప్పుడు కల్పించాల్సిన అవసరం లేదు. ఆ దిశగా అమెరికా, కెనడా, మెక్సికోల్లో రెండోసారి తనిఖీ చేసే ఆలోచనేదీ లేదని ఫిఫా తేల్చేసింది. కానీ మొరాకోలో రెండో దఫా తనిఖీలు చేపట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది.

ఫిఫా టాస్క్‌ఫోర్స్ రాకతో వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయన్న ఎలాలామీ

ఫిఫా టాస్క్‌ఫోర్స్ రాకతో వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయన్న ఎలాలామీ

మొరాకో సాకర్ బిడ్ కమిటీ అధ్యక్షుడు మౌలే హఫీద్ ఎలాలామీ మాట్లాడుతూ ఫిఫా టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యటనతో వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమైన వసతులేమిటో అర్థం చేసుకోవడానికి వీలు కలిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఆయా వసతులను కల్పించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పని చేస్తామని మౌలే హఫీద్ ఎలాలామీ చెప్పారు. అంతకు మించి వివరాలను వెల్లడించడానికి మౌలే హఫీద్ ఎలాలామీ నిరాకరించారు.

ఫిఫా, మొరాకో మధ్య సంబంధాలు బలహీనం ఇలా

ఫిఫా, మొరాకో మధ్య సంబంధాలు బలహీనం ఇలా

ఫిఫాకు, మొరాకో సాకర్ బిడ్ కమిటీకి మధ్య సంబంధాలు బలహీనంగా ఉన్నాయని మౌలే హఫీద్ ఎలాలామీ అంగీకరించారు. తాజాగా తాము బహిరంగంగానే ఫిఫాతో చర్చలు జరుపాలని నిర్ణయించడంతోపాటు మున్ముందు బిడ్ గెలుచుకునేందుకు అవసరమైన నాణ్యమైన వసతులు కల్పిస్తామని తెలిపారు.

మొరాకోలో లోపాలు బయట పెట్టిన అసోసియేట్ ప్రెస్

మొరాకోలో లోపాలు బయట పెట్టిన అసోసియేట్ ప్రెస్

ఫిఫా తనిఖీ టీం పర్యటనతోపాటు ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్ మొరాకోలో లోపాలను బయటపెట్టింది. మొరాకో ఇంకా యాంటీ ఎల్జీబీటీ చట్టాన్ని ప్రకటించలేదని, మానవ హక్కుల పరిరక్షణ విషయమై మొరాకో మౌనం వహిస్తున్నదని పేర్కొన్నది. అసోసియేటెడ్ ప్రెస్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఫిఫా నిరాకరించింది. ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల బిడ్ ఖరారుపై వచ్చే జూన్ 13వ తేదీన జరిగే ఫిఫా కార్యవర్గ భేటీ ఉన్న నేపథ్యంలో ఫిఫా స్పందించకపోవడం గమనార్హం.

 బిడ్ ఖరారుపై ఫిఫా, మొరాకో మధ్య ఇలా పరిస్థితులు ఉద్రిక్తం

బిడ్ ఖరారుపై ఫిఫా, మొరాకో మధ్య ఇలా పరిస్థితులు ఉద్రిక్తం

బిడ్ ఖరారుపై ఫిఫా, మొరాకో మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొరాకోకు బిడ్ ఖరారు చేసేందుకు సాంకేతిక వసతులు కల్పించాల్సిన వాతావరణం నెలకొంది. ఫిఫా తనిఖీ టీం పరిశీలనతో మొరాకోలో 2026 సాకర్ కప్ నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు బలహీనంగా ఉన్నాయని చెబుతున్నారు.

Story first published: Monday, April 23, 2018, 10:49 [IST]
Other articles published on Apr 23, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+