న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా మదిలో రెండేళ్లకో మినీ వరల్డ్‌కప్ 'ఫైనల్ 8'?

FIFA president Infantino proposes a new mini World Cup called the Final 8: Four things to know

హైదరాబాద్: ఫిఫా ఆధ్వర్యంలో జరిగే సాకర్ వరల్డ్ కప్ కోసం నాలుగేళ్లు గిర్రున తిరిగాయి. జూన్ 14వ తేదీ నుంచి రష్యా రాజధాని మాస్కో వేదికగా 2018 సాకర్ సంరంభం ప్రారంభం కాబోతున్నది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నింటికీ ఇదొక సవాలే. కానీ క్లబ్ సాకర్, వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు వివిధ దేశాల మద్య ప్రాంతీయ టోర్నీలు నిర్వహిస్తూ వస్తోంది 'ఫిఫా'.

పుట్‌బాల్‌ను ప్రోత్సాహాన్నిచ్చే దిశగా

పుట్‌బాల్‌ను ప్రోత్సాహాన్నిచ్చే దిశగా

కానీ ‘ఫిఫా' నాయకత్వం మదిలో ఆటకు ప్రోత్సాహాన్నిచ్చే దిశగా మరో మినీ వరల్డ్ కప్ పురుడు పోసుకుంది. ఫిఫా అధ్యక్షుడు గియాన్నీ ఇన్‌ఫాంటినో ప్రతిపాదిత నూతన మినీ వరల్డ్ కప్ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ మినీ వరల్డ్ కప్ పేరు ‘ఫైనల్ 8'. టోర్నీ విధి విధానాలేమీ ఇంకా ఖరారు కాలేదు. కానీ చివరి దశలో ఎనిమిది జట్లు తలపడతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు.

2021 నుంచి రెండేళ్లకోసారి టోర్నీ

2021 నుంచి రెండేళ్లకోసారి టోర్నీ

ఈ ఎనిమిది జట్లలో రీజినల్ క్లబ్ టోర్నీ విజేతలు, సాకర్ వరల్డ్ కప్ ఆతిథ్య జట్టు, డిపెండింగ్ వరల్డ్ కప్ చాంపియన్ జట్టు, కాన్ఫిడరేషన్ కప్ విజేతలు వంటి వారు ఈ టోర్నలో భాగస్వాములు కానున్నాయి. ఫిఫా సృష్టించిన గ్లోబల్ నేషన్స్ లీగ్స్‌ల్లో విజేత జట్లతో ఈ మినీ వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది.

అక్టోబర్ లేదా నవంబర్ నెలలో

అక్టోబర్ లేదా నవంబర్ నెలలో

2021 నుంచి ప్రతి రెండేళ్ల కోసారి అక్టోబర్ నెలలో గానీ, నవంబర్ నెలలో గానీ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ప్రపంచ‌కప్ నిర్వహణకు ముందు కాన్ఫిడరేషన్స్ కప్ స్థానే నిర్వహించే టోర్నమెంట్‌ను ‘ఫైనల్ 8' అని అంటుంటారని గియాన్నీ ఇన్‌ఫాంటిన్హో. ‘ఫైనల్-8' టోర్నీతో పాటు 24 జట్లతో కూడిన ‘వరల్డ్ కప్-2021' నిర్వహించాలని ప్రతిపాదించింది.

కాన్ఫిడరేషన్ కప్ స్థానంలో ‘ఫైనల్-8'

కాన్ఫిడరేషన్ కప్ స్థానంలో ‘ఫైనల్-8'

ప్రస్తుత కాన్ఫిడరేషన్ కప్ స్థానంలో 24 క్లబ్ వరల్డ్ కప్ నిర్వహించాలన్నది ఫిఫా అధ్యక్షుడు గియాన్నీ ఇన్ ఫాంటిన్హో ప్రతిపాదన. కానీ ప్రతిపాదిత మినీ వరల్డ్ కప్ పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు. ఆట పట్ల భవిష్యత్‌లో ప్రోత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఫిఫా ముందుకు సాగుతోంది.

Story first published: Thursday, May 24, 2018, 11:09 [IST]
Other articles published on May 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X