Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్: జియాన్నీ

యుకోహమా: ఫుట్‌బాల్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (విఎఆర్) విధానం విజయవంతంగా రుజువైందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు జియాన్ని ఇన్‌ఫాంటినో పేర్కొన్నాడు. క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్స్‌లో రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గోల్ పై తలెత్తిన గందరగోళం కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని చెప్పాడు.

విఎఆర్ పూర్తిగా పాజిటివ్ ఫలితాలనిస్తుందని మీడియాతో ఇన్ ఫాంటినో అన్నాడు. వీడియో అసిస్టెంట్ రిఫరీస్ (విఎఆర్) విధానాన్ని ప్రయోగాత్మక మ్యాచ్‌ల్లో పూర్తిగా విజయవంతంగా పరీక్షించామని, చాలా ప్రోత్సాహకరంగా ఉన్నదని, చాలా పాజిటివ్ అని ఇన్ ఫాంటినో అన్నాడు. ప్రారంభంలో తాము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, కొన్ని అంశాలు పూర్తిగా సవివరంగా అధ్యయనం జరిపిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నాడు.

gianni

కానీ ఫలితాలు చాలా పాజిటివ్ అని తెలిపాడు. మ్యాచ్‌లో పారదర్శకంగా న్యాయం చెప్పడానికి రిఫరీలు సరైన నిర్ణయం తీసుకోవడానికి విఎఆర్ సహకరిస్తుందన్నాడు. జపాన్‌లో జరుగుతున్న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి విఎఆర్ విధానాన్ని అధికారికంగా వినియోగిస్తున్నారు. గత బుధవారం అట్లెటికో నేషనల్, కషిమా అంట్లేర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి వినియోగించారు. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ పాయింట్ ద్వారా జపాన్ క్లబ్ కషిమా అంట్లేర్స్ విజయం సాధించింది.

మెక్సికో క్లబ్ ఆఫ్ అమెరికా, రియల్ మాడ్రిడ్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాదించిన సంగతి తెలిసిందే. అయితే ఇన్‌జ్యూరీ సమయంలో క్రిస్టియానో రొనాల్డో ఆఫ్ సైడ్ నుంచి చేసిన గోల్ పాయింట్‌ను నిర్ధారించుకునేందుకు విఎఆర్ వ్యవస్థ సహకారం అడిగాడు. కానీ ఆ సమయంలో విఎఆర్ రిఫరీ సదరు ఆపరేటర్‌తో మాట్లాడుతుండటం వల్ల పిచ్ రిఫరీకి ఆయనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తలెత్తిందన్నాడు. అందుకు తాము క్షమాపణ చెప్పామని తెలిపాడు.

ఫిఫా టెక్నికల్ డెవలప్‌మెంట్ చీఫ్ ఆఫీసర్ మార్కో వాన్ బాస్టెన్ మాట్లాడుతూ విఎఆర్ రిఫరీని పిచ్ రిఫరీ సంప్రదించినప్పడు సదరు రిఫరీ ఆపరేటర్‌తో మాట్లాడుతున్నప్పుడు పొరపాటున తనతోనే మాట్లాడుతున్నాడని పిచ్ రిఫరీ భావించాడన్నాడు. విఎఆర్ ప్రత్యేకించి మూడు సందర్భాల్లో వినియోగంలోకి వస్తుందన్నాడు. పెనాల్టీ కార్నర్ సమయంలోనూ, రెడ్ కార్డు వినియోగించినప్పుడు, గోల్ చేసినప్పుడు ఇది అవసరం అవుతుందని వాన్ బాస్టెన్ తెలిపాడు. కార్నర్, ఫ్రీకిక్, ఆఫ్ సైడ్ వంటి వాటికి విఎఆర్ వినియోగించరని చెప్పాడు.

రిఫరీ నిర్ణయం తీసుకోవడానికి దీర్ఘ కాలం సమయం పట్టినప్పుడు తుది నిర్ణయం తీసుకునేందుకు వీడియో రీప్లేను పరిగణనలోకి తీసుకుంటారు. దీని ద్వారా మ్యాచ్ స్మూత్‌గా సాగుతుంది. ఒకవేళ ఒక నిమిషం అదనంగా గానీ, 30 సెకన్లు గానీ అదనంగా సమయం కేటాయిస్తే మ్యాచ్ ఫలితం ఎవరిదన్న విషయం తేలిపోతుందన్నాడు. దీనివల్ల మ్యాచ్ సమయం కొంచెం కూడా వేస్ట్ కాదని ఇన్ ఫాంటినో తెలిపాడు.

గేమ్ ఫలితం మారిపోతుందని అనుమానం వచ్చినప్పుడు, కన్ఫర్మేషన్ కోసం, పొరపాటు జరుగకుండా ఉండేందుకు మాత్రమే విఎఆర్ సలహాను రిఫరీ తీసుకుంటాడని చెప్పాడు.
వ్యవస్థను మెరుగు పర్చాల్సిన అవసరం ఉన్నదని ఇన్ ఫాంటినో, వాన్ బాస్టెన్ సంయుక్తంగా అంగీకరించారు. వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో అధికారికంగా వినియోగించేందుకు మరికొన్ని మార్పులు చేయాల్సి ఉన్నదని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+