అవినీతి ఆరోపణలు: పోలీసుల అదుపులో ఫిఫా కౌన్సిల్ సభ్యుడు

హైదరాబాద్: ఫిఫా కౌన్సిల్ సభ్యుడు కాన్‌స్టంట్ ఒమరీని అవినీతి ఆరోపణల కింద 24 గంటల పాటు పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో మంగళవారం రాత్రి ఆయన సొంత దేశం కాంగో ప్రాసిక్యూషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఒమరీ ఫిఫా కౌన్సిల్ సభ్యుడు మాత్రమే కాదు ఆఫ్రికన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ ఉపాధ్యక్షుడు కూడా. కాంగో అధ్యక్షుడు జోసెఫ్ కబిలా ప్రత్యేక సలహాదారు లుజులో బాంబీ సలహా మేరకు పోలీసులు ఒమరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం విడుదల చేసినా గురువారం విచారణకు హాజరు కావాలని ప్రాసిక్యూషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాంగో ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కాన్‌స్టంట్ ఒమరీ పని చేశారు. ఆయనతోపాటు ఫుట్‌బాల్ సమాఖ్యకు చెందిన మరో ఇద్దరు అధికారులు, ఒక ప్రభుత్వ క్రీడాశాఖ అధికారిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు అధికారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫుట్‌బాల్ ప్రోత్సాహానికి కేటాయించిన నిధుల దుర్వినియోగం
కాంగోలో ఫుట్‌బాల్ ప్రోత్సాహానికి, జాతీయ జట్టుకు, దేశంలోని వివిధ జట్ల ప్రోత్సాహానికి, అభివ్రుద్ధికి, జాతీయస్థాయి, ప్రాంతాల వారీగా టోర్నీల నిర్వహించడానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై వారిని ప్రశ్నించామని దేశాధ్యక్షుడు జోసెఫ్ కబిలా సలహాదారు బాంబీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఇంతటితో ఆగలేదు. కాంగో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిని కూడా ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. కాంగో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సహకరించాలని ప్రభుత్వం దేశ ప్రజలను అభ్యర్థించింది.

రెండో తేదీ నుంచి విచారణ మొదలు
ఈ నెల రెండో తేదీన మొదలైన విచారణ నిరంతరం వారిని ప్రశ్నిస్తూనే ఉంది. కాన్ స్టంట్ ఒమరీతోపాటు మిగతా ముగ్గురు అధికారులు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు రావడంతో వారిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒమరీతోపాటు ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు థియోబాల్డ్ బినముంగు, సీఎఫ్ఓ రోజర్ బాండెంబే, క్రీడాశాఖ సెక్రటరీ జనరల్ బార్తెలెమీ ఒకిటో కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. టీంలకు వసతులు కల్పించేందుకు, మ్యాచ్‌ల నిర్వహణకు 10 లక్షల అమెరికా డాలర్లను కాంగో ప్రభుత్వం కేటాయించింది. కానీ ఈ నిధులన్నీ అన్యాయంగా కొట్టేశారని తెలిపారు.

2015లో ఫిఫా కౌన్సిల్‌కు సభ్యుడిగా ఎన్నికైన ఒమరీ
2015లో ఫిఫా కౌన్సిల్‌కు కాన్‌స్టంట్ ఒమరి సభ్యుడిగా ఎన్నికయ్యారు. గియాన్నీ ఇన్ఫాంటినో అధ్యక్షతన గల 37 మంది సభ్యులు గల ఫిఫా కౌన్సిల్‌లో ఎన్నికైన ఏడుగురు సభ్యుల్లో కాన్‌స్టంట్ ఒమరీ ఒకరు. ఆఫ్రికా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇప్పటికే సభ్యుడు కానస్టంట్ ఒమరీ ఒకరు. ఆఫ్రికా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (సీఎఎఫ్)లోని ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ప్రమోషన్ పొందిన వారిలో ఒకరు.

ఒమరీతోపాటు మరో ముగ్గురి అరెస్టుతో అప్రమత్తమైన ఫిఫా
ఫిఫా కౌన్సిల్ సభ్యుడు, ఆఫ్రికా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (సీఏఎఫ్) ఉపాధ్యక్షుడు కాన్‌స్టంట్ ఒమరీ, ఇద్దరు ఎఫ్ఈసీఓఎఫ్ఏ ఉపాధ్యక్షులను అరెస్ట్ చేసిన సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఫిఫా నాయకత్వం ఎప్పటికప్పుడు అదనపు సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉంటున్నట్లు ఫిఫా ఒక ప్రకటనలో తెలిపారు. కాన్‌స్టంట్ ఒమరీతోపాటు మరో ముగ్గురు అధికారుల అరెస్ట్ నేపథ్యంలో కాంగోలీస్ లీగ్ అన్ని గేమ్స్‌ను సస్పెండ్ చేసింది. తదుపరి నోటీసు జారీ చేసే వరకు గేమ్స్ నిర్వహణ ఆదేశాలు చేస్తూ జారీ చేసిన ఆదేశాలు అమలులో ఉంటాయని లీగ్ నిర్వాహకులు పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications