For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా క్లబ్ టోర్నీ: రెండో టైటిల్‌పై మాడ్రిడ్ కన్ను

ఫిఫా 12వ క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ గురువారం నుంచి జపాన్‌లోని యాకోహమాలో ప్రారంభం కానున్నది. అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌లోనే ఏడు జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి.

By Nageshwara Rao

యాకొహమా: ఫిఫా 12వ క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ గురువారం నుంచి జపాన్‌లోని యాకోహమాలో ప్రారంభం కానున్నది. అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌లోనే ఏడు జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ జెయింట్స్ 'రియల్ మాడ్రిడ్' జట్టు రెండో దఫా టైటిల్ గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.

జపాన్‌లో ఎనిమిదో సారి జరుగుతున్న ఈ టోర్నీలో మామెలోడి సన్‌డౌన్స్, అట్లెటికో నేషనల్, కషిమా అంట్లెర్స్ జట్లు తొలిసారి ఈ టోర్నీలో అడుగు పెట్టనున్నాయి. వీటితోపాటు జియాంబక్ హుండాయ్ మోటార్స్ రెండోసారి, క్లబ్ అమెరికా మూడోసారి పోటీ పడుతుండగా, డిఫెండింగ్ చాంపియన్ 2014 కప్ విజేత రియల్ మాడ్రిడ్, అక్లాండ్ సిటీ కూడా పాల్గొంటున్నాయి.

ఇంటర్నేషనల్ స్టార్స్‌గా పేరొందిన రియల్ మాడ్రిడ్ జట్టు ఈస్ట్ ఇండియా టీమ్‌తో తలపడనున్నది. ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్ లాస్ బ్లాంకోస్ జట్టుతో వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకునేందుకు రియల్ మాడ్రిడ్ జట్టు గెలుచుకునేందుకు సిద్ధమవుతున్నది. సెర్జియో రామోస్‌తోపాటు మొరాకోకు చెందిన శాన్ లోరెంజో వంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.

Fifa Club World Cup 2016 – preview

వెల్ష్ ఫార్వర్డ్ ప్లేయర్ గారెథ్ బాలె జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లీగ టోర్నీలో బార్సిలోనా ఎఫ్ సి జట్టుకంటే ఎక్కువ పాయింట్లు సాధించి రియల్ మాడ్రిడ్ ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్న 12 యూరప్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాలుపంచుకోనున్నాయి. తద్వారా ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో యూరోపియన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ టోర్నీలో కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టు కూడా టోర్నీలో భాగస్వామి కానున్నది.

ప్రయోగాత్మకంగా వీడియో అసిస్టెంట్ రిఫరీ వినియోగం

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి వీడియో అసిస్టెంట్ రిఫరీ విధానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తారు. ఈ నెల 8 నుంచి 18 వరకు జపాన్ లోని యొకోహమా, ఒసాకలలో జరిగే టోర్నీ మ్యాచ్‌ల్లో ఫౌల్స్, గోల్ పాయింట్లతోపాటు ప్లేయర్లపై ఆంక్షల అమలుకు వీడియో అసిస్టెన్స్ తీసుకుంటారు. దీనివల్ల మ్యాచ్ చేంజింగ్ ఫలితాలే ఆవిర్భవిస్తాయి.

ఫిఫా అధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్ లో వీడియో రిఫరెన్స్ వినియోగించడం ఇదే మొదటిసారి. టెక్నాలజీ వినియోగం దిశగా ఫిఫా గొప్ప ముందడుగు వేయనున్నదని ఫిఫా టెక్నికల్ డెవలప్ మెంట్ చీఫ్ ఆఫీసర్ మార్కో వాన్ బాస్టెన్ చెప్పాడు. టోర్నీ బ్రాడ్ కాస్టర్ డెంట్సు/ఎన్ టివి, హాక్ హైలతోపాటు ఐఎఫ్ఎబిల మద్దతుతో వీడియో రిఫరెన్స్ కు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశామని చెప్పాడు.

ఈ వీడియో అసిస్టెన్సీ రిఫరీ (విఎఆర్)లో లోపాలను అధిగమిస్తూ ముందుకు వెళతామని చెప్పారు. మ్యాచ్ చేంజింగ్ పరిస్థితుల్లో సరైన రిఫరీ సరైన నిర్ణయం తీసుకునేందుకు వీడియో అసిస్టెన్స్ రిఫరెన్స్ తోడ్పాటునిస్తుంది. ఇందుకోసం ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ జపాన్ - 2016 నిర్వాహకుల ఆధ్వర్యంలో రిఫరీలకు వీడియో అసిస్టెన్స్ రిఫరీ (విఎఆర్)లపై అవగాహన కల్పిస్తున్నారు.

ఆయా జట్ల ట్రైనింగ్ టైంలో వీడియోలు చిత్రీకరిస్తూ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. యాకోహమా స్టేడియం చుట్టూ భారీగా వీడియో కెమెరాలను ఏర్పాటుచేశారు. ఫిఫా, ఐఎఫ్ఎబి, టోర్నీ నిర్వాహకుల సాయంతో వీడియో అసిస్టెన్స్ రిఫరీ (విఎఆర్) ఏర్పాట్లుచేస్తున్నారు. రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా 12 దేశాల పరిధిలో జరిగిన వివిధ టోర్నమెంట్లలో వీటిని పరీక్షించారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+