సాకర్‌లో వీడియో రిఫరీ విధానం: ఫిఫా అధ్యక్షుడు
పారిస్: రష్యాలో 2018లో జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో వీడియో రిఫరీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినో అనుకూలమని తెలిపాడు. కీలకమైన సమయాల్లో రిఫరీలు సరైన నిర్ణయం తీసుకోవడానికి వీడియో టెక్నాలజీ వినియోగించుకోవడం సబబు అని వ్యాఖ్యానించాడు.
'కానీ నేను టెస్ట్ పూర్తయ్యాక ఒక ముగింపునకు వచ్చాను' అని తెలిపాడు. తొలుత వీడియో వినియోగం వల్ల మ్యాచ్‌లు నమ్మదిస్తాయని ఆందోళనలు ఉండేవన్నాడు. కానీ స్వతంత్ర సంస్థగా అంతర్జాతీయ ఫుట్ బాల్ అసోసియేషన్ బోర్డు (ఐఎఫ్ఎబి) రెండేళ్ల వ్యవధిలోగా రిఫరీలో వీడియో టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని సిఫారసుచేసింది.
'రెండేళ్ల గడువులోగా మేం బహుళ విధాలుగా (పరీక్ష) చేసిన తర్వాత 2018 మార్చిలో తుది నిర్ణయం తీసుకుంటాం' అని ఇన్ ఫాంటినో చెప్పాడు. 'మనకు 2018 వరల్డ్‌కప్ టోర్నీలో వీడియో రిఫరీ ఉంటుందని ఆశాభావంతో ఉన్నా' అని అన్నాడు. వీడియో టెక్నాలజీ వినియోగంతో రిఫరీగా పరీక్షించేందుకు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రెజిల్, ఇటలీ, పోర్చుగల్, నెదర్లాండ్స్ జట్లను ఎంపిక చేశామని తెలిపాడు.
వీడియో టెక్నాలజీని వినియోగంలోకి తేవడంతోపాటు 'గోల్' లైన్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. 2014 వరల్డ్ కప్, ఈ ఏడాది చాంపియన్స్ లీగ్, యూరోపియన్ లీగ్ ఫైనల్స్‌లో దీన్ని వినియోగించారు. వీడియో రిఫరీ వల్ల పెనాల్టీలు, ఫ్రీ కిక్‌లు, ఆఫ్ సైడ్ రూలింగ్స్‌లో కష్టమైన విధాన నిర్ణయాలు తీసుకోవడం తేలిక అవుతుంది.

ఐ - లీగ్ నుంచి డీ గోవా క్లబ్ ఔట్
ఐ - లీగ్ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు స్పోర్టింగ్ క్లబ్ ‘డి గోవా' స్పష్టంగా ద్రువీకరించింది. క్షేత్రస్థాయిలో ఫుట్ బాల్ ఆటకు ప్రజాదరణ పెంపుదలకు అవసరమైన రోడ్ మ్యాప్ ఏర్పాటుకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్), దాని మార్కెటింగ్ భాగస్వాములు ఐఎంజి - రిలయన్స్ చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాజీ చాంపియన్లు డెంపో జట్టు సైతం ‘లీగ్' నుంచి వైదొలుగుతున్నట్లు తేల్చి చెప్పింది.

గోవా విచారం
‘ఐ - లీగ్ నుంచి వైదొలుగుతున్నందుకు స్పోర్టింగ్ క్లబ్ గా డి గోవా విచారం వ్యక్తంచేస్తున్నది' అని క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘2016 మే 17న ఐఎఎఫ్ఎఫ్, దాని మార్కెటింగ్ భాగస్వాములు కలిసి భారతీయ ఫుట్‌బాల్ కోసం ప్రకటించిన రోడ్‌మ్యాప్ అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో సాల్ గావోస్కర్ ఎఫ్ సి క్లబ్ తో కలిసి వైదొలుగుతున్నామని డి గోవా జట్టు నిర్ణయించాం' అని తెలిపింది.

లైసెన్సింగ్ ప్రక్రియ చేపట్టకపోవడం వల్లే
ఐ - లీగ్ నుంచి వైదొలగడం బాధాకరంగా ఉన్నదని తెలిపింది. తమ ప్రమాణాలకు అనుగుణంగా లైసెన్సింగ్ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఎఐఎఫ్ఎఫ్ కార్యవర్గమే ఐ - లీగ్‌లోకి ప్రవేశించేందుకు మాజీ చాంపియన్లు సాల్ గావోంకర్ క్లబ్ అనర్హురాలైందని ప్రకటించింది. ఎఐఎఫ్ఎఫ్ ప్రణాళికకు అనుగుణంగా భారతీయ ఫుట్‌బాల్‌లో మూడు ఫార్మాట్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఐఎస్ఎల్‌ను టాప్‌లో నిలబెట్టాలి
టాప్‌లో ఐఎస్ఎల్‌ను నిలబెట్టాలన్నది ఎఐఎఫ్ఎఫ్ వ్యూహం. ద్వితీయ, త్రుతీయ డివిజన్ స్టేటస్ టోర్నీలు జరుపాలాని ఎఐఎఫ్ఎఫ్ నిర్ణయించింది. మరికొన్ని క్లబ్‌లు కూడా తమ అభ్యంతరాలు అన్నీ వ్యక్తంచేస్తున్నాయి. భారత ఫుట్ బాల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు ఎఐఎఫ్ఎఫ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications