For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ప్లే విత్ యాన్ ఓపెన్ హార్ట్’.. ఇది రష్యా సాకర్ నినాదం

FIFA announces 2018 World Cup national slogans

హైదరాబాద్: రష్యాలో సాకర్ సంరంభానికి మరో 20 రోజుల గడువు మాత్రమే ఉంది. నిర్వాహక కమిటీ ఏర్పాట్లకు తుది మెరుగులు దిద్దుతుంది. మరోవైపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ 'ఫిఫా' గురువారం 32 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల జాతీయ నినాదాలను, లోగోలను ఆవిష్కరించింది. ఆతిథ్య దేశం రష్యా 'ప్లే విత్ ఓపెన్ హార్ట్' అనే నినాదాన్ని ఆవిష్కరించింది.

 ఇదీ రష్యా ‘ప్లే విత్ యాన్ ఓపెన్ హార్ట్' నినాదం

ఇదీ రష్యా ‘ప్లే విత్ యాన్ ఓపెన్ హార్ట్' నినాదం

‘అభిమానుల ఓట్లు గణించిన తర్వాత, అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి వచ్చాం' అని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేం 32 దేశాల జట్లకు అనువైన నినాదాలు అందుబాటులోకి వచ్చాం. ఈ నినాదాలన్నీ అభిమానుల గుండెలను హత్తుకోవాలి' అని ఫిఫా పేర్కొన్నది. ‘ప్లే విత్ యాన్ ఓపెన్ హార్ట్' నినాదానికి ముందు మరో రెండు సూచనలు వచ్చాయి. ‘రష్యన్ బేర్స్ స్టైడ్ టూ విక్టరీ', ‘విత్ ఎ ఫుల్ హార్ట్ ది ఎంటైర్ నేషన్ ఈస్ పర్స్యూయింగ్ ది డ్రీమ్' నినాదాలు కూడా ముందుకు వచ్చాయి.

నినాదాలతో 2018 వరల్డ్ కప్ నిర్వహణ ఇలా:

నినాదాలతో 2018 వరల్డ్ కప్ నిర్వహణ ఇలా:

‘ఖరారైన జట్ల నినాదాలు రష్యాలో జరిగే 2018 ఫిఫా వరల్డ్‌కప్ టోర్నమెంట్ సందర్భంగా ఆయా జట్లను తీసుకెళ్లే బస్సులపై ప్రదర్శిస్తారు' అని ఫిఫా పేర్కొన్నది. ప్రతి నినాదం లక్కీ విజేత కూడా వచ్చే నెలలో ప్రపంచ కప్ చాంపియన్ షిప్ సందర్భంగా రష్యాలో పర్యటనకు అవకాశం కల్పించనున్నట్లు ఫిఫా తెలిపింది.

‘చరిత్ర తిరగరాద్దాం' అనే నినాదంతో జర్మనీ

‘చరిత్ర తిరగరాద్దాం' అనే నినాదంతో జర్మనీ

డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ‘జుస్సామ్మెన్.గెఛిచ్చ్తే స్క్రెబెన్ (మనమంతా కలిసి చరిత్ర తిరగరాద్దాం) అని అనే నినాదం ఎంచుకుంది. 2016 యుఇఎఫ్ఎ యూరో కప్ చాంపియన్ పోర్చుగల్ జట్టుకు రష్యాలో జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ‘ఓ పస్సాడో ఈ గ్లోరియా, ఓ ప్రెసెంటె ఈ హిస్టరియా (గతమెంతో ఘనకీర్తి. వర్తమానం చరిత్ర)' అన్న నినాదాన్ని అందుకున్నది.

రష్యా సాకర్ కప్ గెలుపే లక్ష్యమన్న లియానెల్ మెస్సీ

రష్యా సాకర్ కప్ గెలుపే లక్ష్యమన్న లియానెల్ మెస్సీ

రష్యాలో జరిగే సాకర్ కప్ టైటిల్‌ను గెలుచుకోవడమే తన లక్ష్యమని అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియానెల్ మెస్సీ పేర్కొన్నాడు. ఏ మాత్రం అవకాశం లభించినా అదనపు టైం లభించినా ప్రస్తుత డిపెండింగ్ చాంపియన్‌ జర్మనీ జట్టును ఓడించగలమని తెలిపాడు. ఎల్లవేళలా అది కలగానే మిగులుతున్నా క్రమంగా బలోపేతం అవుతుందని చెప్పాడు. అంతర్జాతీయంగా, ఖండాల వారీ టోర్నమెంట్లలో పలు టైటిళ్లను గెలుచుకున్న నేపథ్యం లియానెల్ మెస్సీది. బార్సిలోనా ఎఫ్‌సీ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా వచ్చే నెలలో జరిగే రష్యా ఫుట్‌బాల్ టోర్నమెంటులో అర్జెంటీనా తరఫున ఆడనున్నాడు. ఐదుసార్లు బాల్లోన్ డీ'ఓర్ అవార్డు అందుకున్న లియానెల్ మెస్సీ.. బ్రెజిల్‌లో జరిగిన 2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంటులో 2015, 2016ల్లో కొపా అమెరికా టోర్నమెంట్లలో టైటిళ్లు గెలుచుకున్నాడు.

Story first published: Friday, May 25, 2018, 15:10 [IST]
Other articles published on May 25, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+