ఆశలు అడియాసలు: టోర్నీల విస్తరణ ప్లాన్ వెనుకడుగు

హైదరాబాద్: వచ్చేనెలలో రష్యాలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభించడానికి ముందే క్లబ్ ఫిఫా వరల్డ్ కప్, నేషనల్ లీగ్ టోర్నీలను విస్తరించాలన్న ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినోకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ప్రస్తుతం క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ ఏడు జట్లతో ఏటా శీతాకాలంలో నిర్వహిస్తున్నారు. దీన్ని 24 క్లబ్‌లతో కూడిన క్లబ్ ప్రపంచ కప్‌గా విస్తరించాలని ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినో ప్రయత్నం. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్ మాదిరిగానే 2021 నాటికి నాలుగేళ్లకోసారి నిర్వహించాలని జియాన్ని ఇన్‌ఫాంటినో సంకల్పించారు.
రెండేళ్లకోసారి అక్టోబర్ నెలలో జరిగే మినీ వరల్డ్ కప్ టోర్నమెంటుకు అనుసంధానిస్తూ నేషనల్ లీగ్ ప్రారంభించాలని తలపించారు జియాన్ని ఇన్‌ఫాంటినో. ఈ రెండు టోర్నమెంట్ల నిర్వహణ ద్వారా ఫిఫా తొలి 12 ఏళ్లలో 18.7 బిలియన్ల యూరోల ఆదాయం సముపార్జించాలని లక్ష్యం. ఈ ఆదాయం సమకూర్చేందుకు ముందుకు వచ్చిన కార్పొరేట్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు ఇన్ ఫాంటినో. అలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థలు, పెట్టుబడి దారుల పేర్లు మాత్రం వెల్లడించలేదు.

టోర్నీల విస్తరణపై వ్యతిరేకతకు ఇవీ కారణాలు
సంప్రదింపుల్లో వైఫల్యంతో వచ్చిన కోపానికి తోడు సౌదీ అరేబియా తదితర దేశాల రానున్న ఈ ఆదాయ సముపార్జనతోపాటు ప్రస్తుతం సాగుతున్న టోర్నమెంట్లపై ప్రతికూల ప్రభావం, క్లబ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లతో సమతుల్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో జియాన్నీ ఇన్‌ఫాంటినో ప్రతిపాదించిన ప్రణాళికకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

జూన్ 10న కార్యవర్గ సమావేశంలో తదుపరి నిర్ణయాలు
మార్చి నెలలో బొగోటాలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో క్లబ్ వరల్డ్ కప్, నేషనల్ లీగ్ పునర్వ్యవస్థీకరణపై తలెత్తిన ఆందోళనపై చర్చించారు. సంబంధిత వర్గాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. త్వరలో ప్రతిపాదనలపై తదుపరి చర్చలు నిర్వహించాలని నిర్ణయించిందని ఫిఫా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాజా పరిణామాలపై జూన్ 10వ తేదీన జరిగే ఫిఫా పాలక వర్గం చర్చించాల్సి ఉంది.

ఇన్‌ఫాంటినో ప్లాన్‌పై నిప్పులు చెరిగిన అలెగ్జాండర్ కేఫరిన్
ఇదిలా ఉంటే యూఈఎఫ్ఎ అధ్యక్షుడు అలెగ్జాండర్ కేఫరిన్ ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినో ప్రణాళికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వార్థ పూరిత ప్రయత్నాలకు ఏ మాత్రం తావు లేదని యుఇఎఫ్ఎ అధ్యక్షుడిగా చెబుతున్నానని తెలిపారు. ప్రైవేట్ సంస్థల నుంచి లాభాల రూపేణా వచ్చే సొమ్ము కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆమోదించబోనని చెప్పారు. యూరోపియన్ క్రీడల మోడల్‌ను తప్పక గౌరవించాల్సిందేనని, ఫుట్‌బాల్ విక్రయ వస్తువు కాదన్నారు.

టోర్నీ మార్పులతో ఫిఫా నిబంధనలను ఉల్లంఘించడమే
గత మార్చిలో ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినోకు లేఖ రాసిన ప్రీమియర్ లీగ్ అధిపతి రిచర్డ్ స్కూడమోర్ అసలు ప్రతిపాదనల తీరునే ప్రశ్నించారు. ఉత్తమ పాలనా విధానాలను, సుపరిపాలనకు గల అన్ని నిబంధనలను ‘ఫిఫా' ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. స్పెయిన్‌లో స్కుడామోర్ ప్రత్యర్థి జేవియర్ టేబాస్ కూడా ఇలాగే ప్రతిస్పందించారు. ఈ ప్రణాళికలు నేషనల్ లీగ్‌లు, సూపర్ క్లబ్‌లను రూపొందిస్తాయే తప్ప.. ఆచరణలో ప్రతికూల ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. నేషనల్ లీగ్ టోర్నీ విస్తరణ, పునర్వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదన ఉన్నదని కానీ ఈ విషయమై యూరప్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్నారు. క్లబ్ వరల్డ్ కప్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications