Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టోని క్రోస్: ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ రహస్య ఆయుధం

FIFA 2018 World Cup: Player to watch: Toni Kroos, Germanys hidden weapon

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్... ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే క్రీడ. మరికొన్ని గంటల్లో ఈ సాకర్ సంరంభానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. వరల్డ్ కప్‌కు ముందు వరకు ఏయే జట్లు బరిలో నిలుస్తాయమనే టెన్షన్... ఆ తర్వాత ఆయా జట్లలోని సూపర్‌స్టార్ల ఆట ఎలా ఉండబోతుంది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఎవరిని ఎలా నియంత్రించుకోవాలో కోచ్‌లు వ్యూహాలు రచిస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా స్టార్ ప్లేయర్ల ఆటను వీక్షించేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున స్టేడియాలకు వస్తారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో దాదాపు చివరి వరల్డ్ కప్ ఆడుతున్నారు.

మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు హ్యారీకేన్, జర్మనీ జట్టులో తాజాగా వినిపిస్తోన్న పేరు టోని క్రోస్. ఈ వరల్డ్ కప్‌లో వీరిపై అభిమానులతో పాటు ఆయా దేశాలు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో జర్మనీకి చెందిన టోని క్రోస్ సీక్రెట్ వెపన్‌గా బరిలోకి దిగుతున్నాడు.

ఈ వరల్డ్ కప్‌లో టోని క్రోస్ అభిమానులను అలరించే అవకాశం ఉందని సాకర్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ మిడ్ ఫీల్డర్‌గా టోని క్రోస్ కొనసాగుతున్నాడు. 28 ఏళ్ల టోని క్రోస్ జట్టులో ఉండబట్టే రియల్ మాడ్రిడ్ జట్టు మూడు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

జర్మనీ జట్టులో టోని క్రోస్ ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. మిడ్‌ఫీల్డ్‌లో టోని క్రోస్ తన పనిని తాను నెమ్మదిగా చేసుకుపోతాడు. బంతి కోసం చివరివరకు పోరాడతాడు. గత మూడు సీజన్లుగా లాలిగా టోర్నీలో టోని క్రోస్ పాస్‌లను గమనిస్తే అవి 90 శాతం గోల్స్‌గా మలిచడం జరిగింది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతోన్న జర్మనీ టోర్నీలో భాగంగా తన తొలి మ్యాచ్‌లో శనివారం (జూన్ 23)న స్వీడన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది.

Story first published: Wednesday, June 13, 2018, 12:36 [IST]
Other articles published on Jun 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+