Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా ఫైనల్లో వర్షం: గొడుగుతో పుతిన్, సోషల్ మీడియాలో జోకులు

FIFA 2018 World Cup Final: Putin shows he’s the boss, gets an umbrella while others get drenc

హైదరాబాద్: రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియాను 4-2తేడాతో ఓడించి ఫ్రాన్స్ 2018 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ విజయం సాధించడంతో ఫ్రాన్స్‌లో సంబురాలు అంబరాన్నంటాయి.

లుజ్నిక్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ పైనల్లో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ప్రపంచ అభిమానులను అలరించాయి. ఫ్రాన్స్ విజయం సాధించడంతో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ గ్యాలరీలో ఎగిరి గెంతేశారు. మ్యాచ్ అనంతరం జరిగిన ట్రోఫీ కార్యక్రమంలో పలువురు దేశాధ్యక్షులు పాల్గొన్నారు.

FIFA 2018 World Cup Final: Putin shows he’s the boss, gets an umbrella while others get drenc

స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టేజీపై ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగబోతుండగా.. ఒక్కసారిగా వర్షం పడింది. ప్రపంచ అధినేతలందరూ వర్షంలోనే తడిసిముద్దవుతూ.. ఈ వేడుకను ఎంజాయ్‌ చేస్తుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం చినుకు సైతం తనపై పడకుండా.. గొడుగు వేసుకుని నిల్చున్నారు.

పుతిన్‌ మాత్రమే గొడుగు వేసుకోవడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు తెగ జోకులు పేల్చుతున్నారు. పొడియంపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌, క్రొయేషియా అధ్యక్షురాలు కోలిండా గ్రాబార్-కిటరోవిక్ మధ్యలో పుతిన్‌ నిల్చున్నారు.

వారందరితో పాటు ఫిఫా ట్రోఫీకి అడ్డుగా నిలబడి... పుతిన్‌ గొడుగేసుకుని నిల్చోవడంతో, సోషల్‌ మీడియా తెగ జోకులు పేలుతున్నాయి. పుతిన్ గొడుగు దాదాపు ట్రోఫీ వేడుకను కప్పివేసిందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ రష్యాలో ఒకే ఒక గొడుగు ఉందా? అంటు ప్రశ్నించాడు.

పుతిన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న జోకులు మీకోసం...

Story first published: Monday, July 16, 2018, 14:26 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+