Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గత చాంపియన్ ఫ్రాన్స్ పై మెక్సికో సంచలన విజయం

Cuauhtemoc Blanco
పొలక్వెన్‌: అంతగా ఫేవరైట్ కానీ మెక్సికో విజయం సాధించింది. గురువారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌ లో మెక్సికో 2-0తో మాజీ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ లో మెక్సికోదే పూర్తి ఆధిపత్యం. మార్క్వెజ్‌ పాస్‌ ను 64వ నిమిషంలో హెర్నాండెజ్‌ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. డి ప్రాంతంలో బరేరాను అబిడల్‌ ప్రమాదకరంగా అడ్డుకోవడంతో 77వ నిమిషంలో మెక్సికోకు పెనాల్టీ లభించింది.

దాన్ని బ్లాంకో సద్వినియోగం చేశాడు. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌పై మెక్సికోకిదే తొలి విజయం. టోర్నీలో ఉరుగ్వేతో తొలి మ్యాచ్‌ ను డ్రా చేసుకున్న ఫ్రాన్స్‌.. తాజా ఓటమితో నాకౌట్‌ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది. జూన్‌ 22న ఉరుగ్వే, మెక్సికో మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే..అదే రోజు తన చివరి మ్యాచ్‌ లో దక్షిణాఫ్రికాపై ఫ్రాన్స్‌ భారీ తేడాతో నెగ్గినా ఇంటిదారి పట్టాల్సిందే. ప్రస్తుతం గ్రూప్‌-ఎలో ఉరుగ్వే, మెక్సికో నాలుగేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్‌, దక్షిణాఫ్రికా ఒక్కో పాయింట్ ‌తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+