దక్షిణాఫ్రికాలో అప్పుడే కాళ్ళు కదుపుతున్న సవ్వడులు
By Santaram
oi-Santaram
ఫుట్ బాల్ ప్రపంచకప్ క్రీడోత్సవాన్ని నిర్వహిస్తున్న దక్షిణాఫ్రికాలో పండగ వాతావరణం నెలకొంది. దేశంలో అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఫుట్ బాల్ సందడి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పుట్ బాల్ హంగామే. అంతేగాక తమ జట్ల ఆటను చూసేందుకు ఆయా దేశాల నుంచి భారీ సంఖ్యలో దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. దీంతో సఫారీ గడ్డ అభిమానులతో కిటకిటలాడుతోంది. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన సాకర్ వరల్డ్ కప్ ను స్వయంగా తిలకించేందుకు అభిమానులు దక్షిణాఫ్రికాకు తరలివస్తున్నారు.
దీంతో ఇక్కడ సందడే సందడి నెలకొంది. మరోవైపు ఆయా జట్లు ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాయి. టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగలడంతో అన్ని జట్లు సాధనను తీవ్రం చేశాయి. అతిథ్య దక్షిణాఫ్రికా, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇటలీ, పోర్చుగల్, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ తదితర జట్లు ప్రాక్టీస్ లో మునిగాయి. మరోవైపు ప్రపంచకప్ ట్రోఫీని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఫీఫా అధ్యక్షుడు స్వీప్ బ్లట్టర్ కు అందజేశారు.