Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయంతో ఐఎస్‌ఎల్‌ టోర్నీకి పుణె సారధి దూరం: ఫ్లేఆఫ్‌కు క్వాలిఫై సవాలేనన్న ముంబై సారధి డియాగో

పుణె: ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌ ప్రారంభానికి మరో ఐదు రోజుల ముందే ఎఫ్‌సి పుణె సిటీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సారధి ఈదుర్‌ గుడ్జాన్‌సేన్‌కు గాయం కావడంతో సోమవారం స్వదేశానికి బయలుదేరి వెళుతున్నట్లు సమాచారం. ఎఫ్‌సి బార్సిలోనా, చెల్సియా వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఐస్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ క్రీడాకారుడైన గుడ్జాన్‌సేన్‌ (38) ప్రీ సీజన్‌ ప్రాక్టీస్‌లో గాయమైందని తెలుస్తోంది.

ఆయన గత వారం ఓజోన్‌ ఎఫ్‌సి జట్టుతో జరిగిన మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. ఎఫ్‌సి పుణె సిటీ యాజమాన్యం తాజాగా గుడ్జాన్‌సేన్‌ వారసుడి ఎంపికలో నిమగ్నమైనట్లు సమాచారం. అక్టోబర్‌ మూడో తేదీన పుణెలో బాలేవాడీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ముంబై సిటీతో ఎఫ్‌సి పుణె జట్టు తల పడుతుంది.

జట్టులో ప్రతి ప్లేయర్‌ ఫిట్‌నెస్‌ కీలకం: డియాగో ఫోర్లాన్‌

ముంబై: ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లో ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కావడమే తమ జట్టు ముందు ఉన్న సవాల్‌ అని ముంబై సిటీ ఎఫ్‌సి నూతన సారధి డియాగో ఫోర్లాన్‌ పేర్కొన్నాడు. ఇంతకుముందు అత్యంత వివాదాస్పదంగా మారిన ముంబై సిటీ ఎఫ్‌సి సారధి నికోలస్‌ అనెల్కా స్థానంలో ఫ్రాంచైసీ యాజమాన్యం డియాగో ఫోర్లాన్‌ను నియమించింది.

FC Pune City marquee player Eidur Gudjohnsen to miss ISL due to injury

మంచి జట్టు ఉంటే సరిపోదని, లక్ష్యాల సాధనకు ప్రతి ఆటగాడు, ప్రతి మ్యాచ్‌కోసం ఫిట్‌నెస్‌తో పటిష్ఠ స్థితిలో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. రికార్డుల పరంగా బాగానే ఉండొచ్చుగానీ, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఎప్పుడేమీ జరుగుతుందో ఎవరూ ఊహించలేలేరని ఫ్లోరాన్‌ తెలిపాడు. తమ జట్టు స్వదేశీ, విదేశీ క్రీడాకారుల సమ్మేళనమని చెప్పాడు.

'పలు దేశాల జట్లతో నేను ఆడిన మ్యాచ్‌ల్లో చాలా అనుభవం సంపాదించా. కేవలం కొద్ది కాలంలో మీరు కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే ఆడారు. మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. జట్టులోని సభ్యులు గాయాలు లేకుండా పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉండటం కూడా ముఖ్యమే.

రెండు నెలలో మీరు 14 గేమ్స్‌ ఆడాలి. ఐఎస్‌ఎల్‌ భిన్నమైన టోర్నమెంట్‌' అని ఫ్లోరాన్‌ వ్యాఖ్యానించాడు. టోర్నీకి మంచి షెడ్యూల్‌ కూడా ఉంది. నాకు కూడా కొత్త అనుభవం. నాకు పలు ఆఫర్లు వచ్చాయని, కానీ నేను ముంబై సిటీ తరఫున ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చాను' అని ఫోర్లాన్‌ వివరించాడు.

గాయాల మధ్య జాన్‌ అబ్రహం జుట్టు

గౌహతి: బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం ఆధ్వర్యంలోని ఐఎస్‌ఎల్‌ ఫ్రాంచైసీకి కొత్త సమస్య వచ్చి పడింది. నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి జట్టులోని ఇద్దరు విదేశీ ఆటగాళ్లు సాషా అనీఫ్‌, ఫాబియో నెవెస్‌ గాయాల బారీన పడ్డారు. దీంతో వచ్చేవారం గౌహతిలో కేరళ బ్లాక్‌ బస్టర్స్‌తో జరిగే ఐఎస్‌ఎల్‌ మూడో ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌కు వీరు దూరం కానున్నారు.

ఉరుగ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనీఫ్‌.. డిఫెన్సర్‌ స్పోర్టింగ్‌, రేసింగ్‌ క్లబ్‌ డీ మొంటేవీడియో తరఫున కూడా ఆడాడు. బ్రెజిలియన్‌ ఆటగాడైన నెవెస్‌ కాల్‌డెన్స్‌, బొటాఫోగో - ఎఫ్‌బి తదితర జట్ల నుంచి ప్రాతినిధ్యం వహించాడు. చివరిగా కొరియా లీగ్‌లో గ్వాంగ్జు ఎఫ్‌సి తరఫున ఆడాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+