
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగమైన జట్టుల్లో ఎఫ్ సీ జట్టు ఒకటి. ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న రాంకొ పొపొవిక్ చేసిన నిర్వాకానికి యాజమాన్య సంఘం ఐదు లక్షల జరిమానాను విధించింది.
డిసెంబరు 28 గురువారం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్)కి చెందిన డిసిప్లినరీ కమిటీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. జట్టులోని సభ్యులతో, తోటి స్థాయి ఆటగాళ్లతో సరిగా ప్రవర్తించట్లేదంటూ పలువురి ఇతనిపై ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన సంబంధిత శాఖ విచారణ చేపట్టింది.
డిసెంబరు 23న జరిగిన ఎఫ్‌సీ గోవా, ఎఫ్‌సీ పూణె సిటీల మధ్య జరిగిన మ్యాచ్ గురించి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాంకొ పొపొవిక్ ప్రతికూలంగా ప్రవర్తించి వివాదానికి గురైయ్యాడు. నేర నిరూపణ కావడంతో అతనికి ఐదు లక్షలు జరిమానా విధించింది. దాంతోపాటు వరుసగా మూడు మ్యాచ్‌లకు నిషేదాజ్ఞలు జారీ చేసింది. ఈ జరిమాన చెల్లించేంత వరకు అతను మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సిందే.
సెర్బియన్ ఫుట్‌బాల్ కోచ్ రాంకొ పొపొవిక్ 2017 తొలినాళ్లలోనే అడుగుపెట్టాడు. జట్టులో అప్పటివరకు ఆడుతూ ఉన్న ఆంటొనియా హబాస్ మానేయడంతో ఎఫ్‌సీ పూణె జట్టులో ఓ భాగమైయ్యాడు.
ఇప్పటివరకు ఎఫ్‌సీ పూణె సిటీ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు గెలిచి మూడో సార్లు ఓడింది. మొత్తం ఆడిన మ్యాచ్‌లకు గాను ఎఫ్‌సీ సిటీ స్కోరు 12గా టాప్-4లో ఒకటిగా ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.