Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోవా గాంభీర్యం: ముందడుగుపై ముంబై కన్ను

మార్గోవా: నార్త్ఈస్ట్ జట్టుపై విజయం స్ఫూర్తితో ముంబై సిటీతో బుధవారం రాత్రి పాటోర్డాలో జరిగే మ్యాచ్‌లోనూ చెలరేగిపోవాలని ఎఫ్‌సి గోవా జట్టు తలపోస్తున్నది. ఇంతకుముందు నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 2 - 1 స్కోర్ ఆధిక్యంతో గోవా జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే రెడ్ కార్డు చూపడంతో గ్రెగరీ ఆర్నోలిన్, రిచర్ల్యైసన్ తిరిగి జట్టులోకి రానున్నా లుసియానో సొబ్రోసా, రాఫెల్ దుమాస్‌లపై మరో మ్యాచ్ సస్పెన్షన్ కొనసాగనుండటంతో గోవా జట్టుకు కష్టకాలమే. ఇక గత మ్యాచ్‌లో రెడ్ కార్డునందుకున్న సాహిల్ తావోరా సైతం ముంబైతో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నాడు.

ఈ ఎడిషన్లో ఇంత వరకు గోవా తన సొంతగడ్డపై మ్యాచ్ లో గెలుపొందలేదు. ఈ నేపథ్యంలో ముంబైతో జరిగే మ్యాచ్ లో గోవా జట్టు ఖచ్చితంగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరుగురు విదేశీ ఆటగాళ్లలో కొందరిపై సస్పెన్షన్ వేటు, మరి కొందరు గాయాలతో మ్యాచ్ కు దూరంగా ఉండటం గోవాకు ఇబ్బందికరమే. తన కుర్రాళ్లపై తనకు విశ్వాసం ఉన్నదని గోవా హెడ్ కోచ్ జికో పేర్కొనడం గమనార్హం.

ఇక ముంబై సిటీ సైతం పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకర రీతిలో 1-0 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. పూర్తిగా ఆధిపత్యం సాధించిన పుణె ముందు ముంబై సిటీ విలవిలలాడింది. ఫలితంగా ముంబైకర్లు లీగ్ విక్టరీ సాధనలో మరో అడుగు వెనుక పడ్డారు. ఈ దశలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేందుకు గోవాతో జరిగే మ్యాచ్ లో ముంబైకర్లు సంసిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం జరుగనున్న మ్యాచ్ పరస్పరం పోటాపోటీగా మారనున్నది. ఇరు జట్ల శక్తి సామర్థ్యాలకు పరీక్ష కానున్నది. తొలి ఏడాది రెండు మ్యాచ్ లు కూడా గోల్ లేకుండా డ్రాగా ముగిస్తే 2015లో చెరో మ్యాచ్ గెల్చుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ జరిగిన మ్యాచ్‌లో రిచర్ల్యైసన్ 40వ నిమిషంలో చేసిన గోల్‌తో గోవా విజయం సాధించగలిగింది.

పాసింగ్‌లో రాజు, సునీల్ పోటాపోటీ

పాసింగ్‌లో రాజు, సునీల్ పోటాపోటీ

ప్రస్తుత సీజన్‌లో ఎఫ్ సి గోవా జట్టు తరుపున ప్రతి మ్యాచ్‌లోనూ ఆడుతున్న ప్లేయర్ రాజు గైక్వాడ్. అద్భుతమైన పాసర్‌గా, ప్రత్యర్థుల వ్యూహంలో జోక్యం చేసుకుంటూ బంతిని డిఫెన్స్ లోకి తీసుకోవడం గైక్వాడ్ స్పెషాలిటీ. కార్నర్స్‌లో ఎయిర్ స్ట్రయిక్స్ చేయగల సామర్థ్యం గల గైక్వాడ్ అంటే ప్రత్యర్థులకు హడలే మరి. ముంబై సిటీ తరఫున బరిలోకి దిగుతున్న ఇండియన్ ఫుట్ బాల్ పోస్టర్ బాయ్ సునీల్ ఛెత్రి పరిగణనలోకి తీసుకునే ఫోర్స్ అంటే అతిశేయోక్తి కాదు. త్వరితగతిన బంతిని పాస్ చేయగల సామర్థ్యంతోపాటు గొప్ప శక్తి సామర్థ్యాలు గల ప్లేయర్. గత ఏడాది ఐఎస్ఎల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి ఈ ఏడాది ఇంకా ఖాతా ప్రారంభించనే లేదు. అయితే ఈ ఏడాది ముంబై సిటీ ఎఫ్ సి సైమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాలంటే ఆయన కొన్ని గోల్స్ చేయడంతోనే సాధ్యం. తద్వారా ముంబై సిటీ ఎఫ్ సికి ఒకింత బలం కూడా చేకూరనున్నది.

రోమియో, వాడోక్‌లు అత్యంత కీలకం

రోమియో, వాడోక్‌లు అత్యంత కీలకం

చివరిక్షణంలో గోవా విజయంలో రోమియో ఫెర్నాండెజ్ కీలక పాత్రధారి. ఇంతకుముందు నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరి క్షణంలో రోమియో ఫెర్నాండెజ్ ఆటే గోవాకు విజయం చేకూర్చింది. అంతే కాదు ప్రత్యర్థి జట్టు వ్యూహంలోకి చొచ్చుకెళ్లడమే కాదు బంతిని స్వాధీనంచేసుకోగల సత్తా కలిగి ఉన్నాడు. ఫ్రీ కిక్ ద్వారా జట్టుకు పలు దఫాలు విజయాలు సాధించిన పెట్టిన నేపథ్యం రోమియోకు వెన్నతోపెట్టిన విద్య. స్థిరంగా బంతిని బాక్స్‌లోకి పంపగల సామర్థ్యం గల ఆటగాడు. ప్రస్తుత సీజన్ లో అత్యుత్తమ డిఫెన్స్ రికార్డు గల ప్లేయర్ ఫెర్నాండెజ్ తన వంతు లక్ష్యాల సాధనకు కష్టపడతాడు. ఇక ముంబై తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్జియాన్ వాడోక్ ప్రస్తుత ఎడిషన్ ఐఎస్ఎల్ లో జట్టుకు చాలా కీలకమైన కుర్రాడు. జట్టు తరఫున ఆడే మ్యాచ్ లో ప్రతి నిమిషం ఆటలో మమేకం అయిపోతాడు. మిడ్ ఫీల్డర్ గా వ్యవహరిస్తూ గొప్ప పాసింగ్ స్కిల్స్ అనుసరిస్తున్న ఆటగాడు. ప్రత్యర్థి జట్టు డిఫెండర్ల కదలికలకు అనుగుణంగా చెలరేగిపోతాడు.

రాబిన్‌కు దీటుగా ఖోంగ్జీ

రాబిన్‌కు దీటుగా ఖోంగ్జీ

గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తున్న రాబిన్ సింగ్ సహజసిద్ధమైన గోల్స్ వేటగాడంటే అతిశేయోక్తి కాదు. సరైన సమయంలో సరైన పరిస్థితుల్లో గోల్స్ సాధించగలడని రాబిన్ సింగ్‌పై జట్టుకు నమ్మకం. ప్రత్యర్థి జట్ల డిఫెన్స్‌ను ఛిన్నాభిన్నంచేసి అవకాశాలు కల్పించి బంతిని ముందుకు పాస్ చేయడంలో నేర్పరి. రాబిన్ సింగ్ రాకతో గతవారం నార్త్ఈస్ట్ జట్టుపై మాదిరిగా ముంబై సిటీ జట్టుపై విజయంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఐబార్లాంగ్ ఖోంగ్జీ ప్రస్తుత సీజన్ లో తన శక్తి సామర్థ్యాలను రుజువుచేసుకున్నాడు. మ్యాచ్ లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని.. ప్రతి నిమిషాన్ని జట్టు విజయం కోసం ఆడాడు. ప్రత్యర్థి జట్లలోకి చొరబడి బంతిని తస్కరించగలడు. వ్యూహాలు రూపొందించి ప్రత్యర్థి జట్ల ఫార్వర్డ్ ప్లేయర్లను తరుచుగా నిలువరించగల సామర్థ్యం ఖోంగ్జీ సొంతం బుధవారం గోవాతో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గోల్ సాధించేందుకే ప్రయత్నిస్తాడని అంతా భావిస్తున్నారు.

 జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఎఫ్ సి గోవా: లక్ష్మీకాంత్ కట్టిమణి, సుభాషిష్ రాయ్ చౌదరి, సుఖ్ దేవ్ పాటిల్, లుసియో, దేబబ్రతరాయ్, దెంజిల్ ఫ్రాంకో, ఫుల్గాంకో కార్డోజో, గ్రేగరీ ఆర్నోలిన్, కీనన్ అల్మైదా, రాజు గైక్వాడ్, సంజయ్ బాల్ముచ్చు, జాఫ్రీ, మందార్‌రావు దేశాయ్, ప్రతీశ్ శిరోద్కర్, రిచర్ల్యైసన్, రోమియో ఫెర్నాండెజ్, త్రిండాడే గోంక్లేవ్స్, జులియో సీజర్, రాఫెల్ కొయెల్హో, రైనాల్డో, రాబిన్ సింగ్.

ముంబై సిటీ ఎఫ్ సి: రాబర్టో వొల్పాటో నెటో, అమరీందర్ సింగ్, అల్బినో గోమ్స్, గెర్సొన్ వెయిరా, లుసియాన్ గౌవాన్, ఫాకుండో కార్డొజో, అన్వర్ అలీ, అయిబొర్లాంగ్ ఖోంగ్జీ, లాల్మాంగాహ్సంగా రాల్టే, లాల్చున్మావాయి ఫనాయి, అశుతోష్ మెహతా, క్రిస్జియాన్ వడోక్, లియో కోస్తా, జాకీచంద్ సింగ్, సరణ్ సింగ్, షెహ్నాజ్ సింగ్, భాయిథాంగ్ హావోకిప్, డేవిడ్ లాల్రిన్మౌనా, మాటియాస్ డెఫెడెరికో, ఒటాలికో బ్రిటో అల్వెస్. సోనీ నార్డే, డియాగో ఫోర్లాన్. థియాగో చున్హా, సునీల్ ఛెత్రి, ఉదాంతా సింగ్.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+