న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

2020: మరో మూడేళ్లు బార్సిలోనాతోనే ఆండ్రెస్ ఇనైస్టా

స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ ‘లా లీగ’ జెయింట్స్ ఎఫ్ సి బార్సిలోనా జట్టు ప్లేయర్ అండ్రెస్ ఇనైస్టా.. క్లబ్ యాజమాన్యంతో కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకం చేయనున్నాడు. 

By Nageshwara Rao

బెంగళూరు: లా లీగ జెయింట్స్ క్లబ్ ఎఫ్ సి బార్సిలోనా జట్టు యాజమాన్యం తన ప్రధాన మిడ్ ఫీల్డర్ ఆండ్రెస్ ఇనైస్టాతో కాంట్రాక్ట్ పొడిగింపునకు సంతకం చేసేందుకు రంగం సిద్ధమైంది. బార్సిలోనాతో ఇనెస్టా 2020 వరకు కాంట్రాక్ట్ కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రెస్ ఇనెస్టా కాంట్రాక్ట్ వచ్చే ఏడాదితో ముగియనున్నది. అంటే 2018 జూన్ వరకు ఇనెస్టా తన బార్సిలోనా జట్టుతోనే ఉంటాడు.

ముండో డిప్రిటివో సూచన మేరకు బార్సిలోనా లెజెండ్ ప్లేయర్ ఇనైస్టా మరో రెండు సీజన్ల వరకు తన పాత జట్టుతోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. ఆండ్రెస్ ఇనైస్టా జట్టు యాజమాన్యానికి విధేయత ప్రకటిస్తూ అంకిత భావంతో ప్రతి దశలోనూ టోర్నీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జట్టు సారథిగా ఉన్న ఆండ్రెస్ ను సాధ్యమైనంత వరకు తమ జట్టుతోనే ఉండేలా చూసుకోవాలని బార్సిలోనా యాజమాన్యం ఆశిస్తోంది.

ఇటీవల ఓ స్పానిష్ మీడియా సంస్థతో ఆండ్రెస్ ఇనైస్టా మాట్లాడుతూ తమ కాంట్రాక్ట్ గురించి భవిష్యత్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అందుకు తనకు గర్వకారణంగా ఉన్నదన్నాడు. తాము ఇప్పటికే మాట్లాడామని, తమ మధ్య ఇంకా ఏడాదిన్నర కాంట్రాక్ట్ ఉన్నదని తెలిపాడు. అది చాలా తార్కికంగా ఉంటుందన్నాడు.

FC Barcelona to keep Andres Iniesta until 2020

ఈ 32 ఏళ్ల మిడ్ ఫీల్డర్ 2002లో బార్సిలోనా క్లబ్ తరఫున ఫుట్ బాల్ ఆడుతున్నాడు. ఈ ఫుట్ బాల్ క్లబ్ తరఫున ఆడిన ఇనైస్టా ప్రతి టైటిల్ సాధించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఆయన స్నానిష్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఫిఫా వరల్డ్ కప్, రెండు యూరో కప్‌లు గెలుచుకోవడంలో విజయం సాధించాడు. ప్రస్తుత తరంలోని ఫుట్ బాల్ ప్రముఖమైన ప్లేయర్లలో ఇనైస్టా ఒకడిగా నిలిచాడు.

అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్లపై మాంఛెస్టర్ యునైటెడ్ జోస్ మౌరిన్హో వల
లా లీగ జెయింట్స్ బార్సిలోనా, అట్లెటికో మాడ్రిడ్ జట్టులోని ఆంటోనీ గ్రైజ్మన్, సాల్ నిగౌజ్ లపై మాంఛెస్టర్ యునైటెడ్ మేనేజర్ జోస్ మౌరిన్హో కన్నేశాడు. వారిద్దరిని జట్టులోకి తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాడు. ఫార్వర్డ్ ప్లేయర్ గా గ్రైజ్మన్, మిడ్ ఫీల్డర్ గా సాల్ నిగౌజ్ అట్లెటికో మాడ్రిడ్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రాన్స్ ఫర్ జోన్ కింద వారిద్దరినీ 145 మిలియన్ల యూరోలకు మాంఛెస్టర్ యునైటెడ్ జట్టుకు బదిలీచేసేందుకు అట్లెటికో మాడ్రిడ్ జట్టు సిద్ధంగా ఉంది. త్వరలో చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్) క్లబ్ లో చేరిపోనున్న వాయ్నే రూనీ స్థానే గ్రైజ్మన్ ను జట్టులోకి తీసుకోవాలని జోస్ మౌరిన్హో తహతహలాడుతున్నాడు.

ఇంతకుముందు చెల్సియా, మాంఛెస్టర్ సిటీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన గ్రైజ్మన్.. మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో చేరేందుకు నిరాశతో ఉన్నా సారధిగా కాంట్రాక్ట్ పై సంతకంచేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. సాల్ ను సైతం తమ జట్టులో చేర్చుకోవాలని మౌరిన్హో ఆరాటంతో ఉన్నాడని తెలుస్తోంది. డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ గా స్పానియార్డ్ సాల్ ఫుట్ బాల్ క్రీడలోనే చాలా కీలకం. అవసరాన్ని బట్టి డిఫెన్స్ వ్యూహం అమలుచేస్తూ స్క్వాడ్ కు మార్గనిర్దేశం చేయడం సాల్ నిగౌజ్ కు గల అదనపు క్వాలిటీల్లో ఒకటిగా ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X