న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫ్రాన్స్ గెలిచింది.. అభిమానం కాళ్ల కింద నలిగింది..!!

Fans clash with police while celebrating France’s World Cup semi final win

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో బెల్జియంను 0-1తేడాతో ఓడించి ఫ్రాన్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 12 ఏళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్‌కు చేరడంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం భారీ సంఖ్యలో అభిమానులు ప్యారిస్‌ వీధుల్లో రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

అయితే భారీ ఎత్తున క్రాకర్స్‌, బాణసంచా కాల్చడమే కాకుండా, బారీ కేడ్స్‌ అడ్డం పెట్టి సోఫాలపై కూర్చున్నారు. దీంతో అప్రమత్తమైన రియోట్‌ ప్రాంత పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తిరగబడ్డారు. దీంతో టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మైదానంలో మరికొద్దీ సేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మ్యాచ్ మొదలుపెట్టడమే బెల్జియం ఫేవరేట్‌గా బరిలోకి దిగడంతో.. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. మొదటి అర్థభాగం పూర్తి అయినా ఒక్కగోల్ కూడా నమోదు కాకపోవడంతో.. విజయంపై మరింత ఆసక్తి పెరిగింది. సరిగ్గా అదే సమయంలో.. 51వ నిమిషంలో శామ్యూల్ ఉమ్మటి హెడర్‌ గోల్‌తో ఫ్రాన్స్‌కి 1-0తో ఆధిక్యం అందించాడు.

1
958082

దీంతో.. ఒత్తిడికి గురైన బెల్జియం ఆఖరి వరకూ ఆధిక్యాన్ని సమం చేసేందుకు ప్రయత్నించినా.. ఆ జట్టుకి నిరాశే ఎదురై.. బెల్జియంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ జట్టు తుది పోరుకి అర్హత సాధించింది. బుధవారం ఇంగ్లాండ్, క్రొయేషియాల మధ్య జరిగిన మ్యాచ్‌లోని విజేతతో ఫ్రాన్స్ ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Wednesday, July 11, 2018, 14:33 [IST]
Other articles published on Jul 11, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X