For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొంతింటి అనుభూతి కలిగిస్తాం.. సాకర్ సంరంభంపై పుతిన్

Everything to be done for 2018 FIFA World Cup guests ‘to feel like home in Russia’ — Putin

హైదరాబాద్: నెల రోజుల పాటు అంటే జూన్ నెల 14వ తేదీ నుంచిసాకర్ సంరంభానికి ఆతిథ్యం ఇస్తున్న రష్యా.. అతిథులకు మరిచిపోలేని అనుభూతి కల్పించాలని భావిస్తోంది. సాకర్ సంరంభానికి మరో 18 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ దేశాల ప్లేయర్లు, అభిమానులకు రష్యా తమ సొంతింటి అనుభవం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం (ఎస్పీఐఈఎఫ్) సదస్సులో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.

 అద్భుతమైన వేడుకగా సాకర్ సంరంభం

అద్భుతమైన వేడుకగా సాకర్ సంరంభం

ఈ సదస్సుకు జపాన్ ప్రధాని షింజో అబె, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ ఖిసాన్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా లాగార్డే తదితరులు హాజరయ్యారు. సదస్సు మోడరేటర్ అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ ఫుట్‌బాల్ చాంపియన్ ఆతిథ్య హక్కు గెలుచుకున్న ఆర్గనైజర్లే విజేతలు అని తెలిపాడు. ఎంతో అద్భుతమైన గేమ్‌ను అభిమానించే వారికి ఇది అద్భుతమైన వేడుకగా నిలుపుతామన్నారు. ఒక టీం మాత్రమే చాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంటుంది. ఉత్తమమైన జట్టు మాత్రమే గెలుచుకుంటుందని పుతిన్ తెలిపాడు.

 రష్యాపై గెలుపు విషయమై ఆశలు పెట్టుకున్న జపాన్ ప్రధాని షింజో అబే

రష్యాపై గెలుపు విషయమై ఆశలు పెట్టుకున్న జపాన్ ప్రధాని షింజో అబే

‘ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను వీక్షించడానికి వచ్చే అభిమానులు, స్పెషలిస్టులు, ఆటగాళ్లు రష్యాలో ఉన్నన్ని రోజులు సొంతింటిగా పరిగణించేలా ఆతిథ్యం ఇస్తామని పుతిన్ అన్నాడు. జపాన్ ప్రధాని షింజో అబె మాట్లాడుతూ తమ జపాన్ టీం 2018 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‍లో రష్యాకు వ్యతిరేకంగా ఫైనల్స్‌లో గెలుపొందాలని ఆశగా ఉంది' అని పేర్కొన్నాడు. ‘ఇది మా కల. ఆశకు, వాస్తవానికి చాలా తేడా' ఉందని చెప్పాడు. సెమీ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ జట్టుతో జపాన్ జట్టు ఓడిపోయిందని తెలిపాడు. నిజాయితీగా చెప్పాలంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ జపాన్ జట్టును ఫ్రాన్స్ జట్టు ఎలా ఓడిస్తోందోనని ఊహిస్తారు' అని తెలిపాడు.

 సాకర్ కప్ టోర్నీకి మళ్లీ రష్యాకు రానున్న మాక్రాన్

సాకర్ కప్ టోర్నీకి మళ్లీ రష్యాకు రానున్న మాక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ వచ్చేనెలలో జరుగనున్న సాకర్ కప్ సంరంభానికి హాజరు కానున్నారు. ప్రస్తుతం ద్వైపాక్షిక చర్చల కోసం రష్యాకు వచ్చిన మాక్రాన్.. జాతీయ జట్టును ప్రోత్సహించేందుకు మళ్లీ రావాలని భావిస్తున్నారు. ‘నేను ఆశావాదిని. కొన్ని వారాల తర్వాత తిరిగి జాతీయ జట్టును ప్రోత్సహించేందుకు మళ్లీ రష్యాకు రావాలని భావిస్తున్నా. అప్పుడు మళ్లీ పుతిన్‌తో కలిసే అవకాశం ఉంది' అని మాక్రాన్ తెలిపాడు.

 రెండు నెలల పాటు రష్యాలో ఎమర్జెన్సీ

రెండు నెలల పాటు రష్యాలో ఎమర్జెన్సీ

ఫిఫా వరల్డ్ కప్ జరుగనున్న రష్యాలో రెండు నెలల పాటు అత్యవసర పరిస్థితులు (హై అలర్ట్) ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు హై అలర్ట్ అమలులో ఉంటుందని రష్యా ఎమర్జెన్సీ సర్వీసుల శాఖ తెలిపింది. ప్రక్రుతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల నంచి రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలల పాటు 40 వేల మందికి పైగా సహాయ సిబ్బంది సంబంధిత స్టేడియంలు, ఫుట్ బాల్ ఆటగాళ్లు, మేనేజర్లు, అధికారులు బస చేసే ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తారు. క్రైసిస్ నియంత్రణకు కేంద్రాలు అందుబాటులో ఉంటాయి.

Story first published: Sunday, May 27, 2018, 12:32 [IST]
Other articles published on May 27, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+