Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: 'భారత జట్టులో ఎవరి స్థానం పదిలం కాదు'

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ జట్టు నుంచి జెజె లాల్పెఖ్లౌవాను తప్పిస్తే ఏం చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే వారు ఫక్కున నవ్వేస్తారు. కానీ జెజె లాల్పెఖ్లౌవా మాత్రం విభిన్నంగా స్పందిస్తాడు. జాతీయ ఫుట్‌బాల్ జట్టులో ఏ ఒక్క క్రీడాకారుడికి చోటు దక్కడం తప్పనిసరి కాదని ఈ ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఉత్తమ ఆటగాడు జెజెలాల్పెఖ్లౌవా వ్యాఖ్యానించాడు.

'గత రెండేళ్లుగా జాతీయ టీం సెటప్‌లోకి పలువురు కొత్త ప్లేయర్లు వచ్చి చేరుతున్నారు. ఏ ఒక్క ప్లేయర్ స్థానం కూడా జట్టులో శాశ్వతం కాదు' అని జెజె ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 'ప్రతి ఒక్కరూ జట్టులో తమ స్థానం కోసం పోటీ పడుతుంటారు. అయినా నా వంటి వారి స్థానమైనా, సునీల్ ఛెత్రి స్థానమైనా సురక్షితం కానేకాదు' అని ఈ మిజోరం స్ట్రయికర్ వ్యాఖ్యానించాడు.

ఈ ఏడాది అత్యధిక గోల్స్

ఈ ఏడాది అత్యధిక గోల్స్

ఆయన కెరీర్ లో ఈ ఏడాది అత్యధిక గోల్స్ సాధించాడు. సాఫ్ప్ కప్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో గోల్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చిన ఈ మాజీ పుణె ఎఫ్ సి ప్లేయర్.. మొహున్ బగన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫెడరేషన్ కప్ గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనే ఎనిమిది గోల్స్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్ అర్హత మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆడిన జెజె... ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ చేశాడు. భారత్ టీం తరఫున ఐదుసార్లు గోల్స్ చేశాడు.

నా ఎదుగుదలకు కారణమైన వారిద్దరికి ధన్యవాదాలు

నా ఎదుగుదలకు కారణమైన వారిద్దరికి ధన్యవాదాలు

‘నా ఎదుగుదలకు కారణమైన నా క్లబ్ మొహున్ బగన్‌కు, కోచ్ సంజయ్ సేన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి జట్టులో చేరిన తర్వాత నాకు నేను ప్లేయర్ గా ఎదిగా. నాటి నుంచి పలు బాధ్యతలు స్వీకరించాను' అని జెజె అన్నాడు. ఇండియన్ టీం కోచ్ కాంస్టాటైన్, ఐఎస్ఎల్ ఫ్రాంచైసీ జట్టు చెన్నైయిన్ ఎఫ్ సి కోచ్ మార్కో మాట్టరాజీ కూడా తన కెరీర్‌లో ముఖ్యమైన పాత్రలు పోషించారని చెప్పాడు. ఎఎఫ్‌సి లీగ్ టోర్నీల్లో ప్రత్యర్థి జట్లతో సమానంగా గోల్స్ సాధించడంలో పోటీ పడ్డానన్నాడు. ఏడు మ్యాచ్ ల్లో ఆరు గోల్స్ చేసిన జెజె ఆధ్వర్యంలోని మొహున్ బగన్ 16వ రౌండ్‌లో ఎఎఫ్‌సి టోర్నీ నుంచి వైదొలిగింది.

ఫ్లేఆఫ్ దశకు చేరుకోని చెన్నైయిన్ ఎఫ్ సి

ఫ్లేఆఫ్ దశకు చేరుకోని చెన్నైయిన్ ఎఫ్ సి

ఇక ఐఎస్ఎల్‌లో చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుకు మూడు గోల్స్ చేసినా ఫ్లేఆఫ్ దశకు చేరుకోలేకపోయింది. ‘సాల్ట్ లేక్ స్టేడియంలో తాంపినెస్ రోవర్స్ జట్టుకు వ్యతిరేకంగా నేను చేసిన గోల్ నాకు అత్యంత చిరస్మరణీయమైంది' అని జెజె గుర్తుచేసుకున్నాడు. ఎఎఫ్ సి చాంపియన్స్ లీగ్ అర్హత పోటీల్లో పాల్గొన్నజెజె ఐదో నిమిషంలోనే గోల్ సాధించి మొహున్ బగన్ జట్టును 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించి భారత క్లబ్ ఫుట్ బాల్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాడు. ‘ఆ మ్యాచ్ చాలా చారిత్రకమైంది. నా ముందు వేల మంది అభిమానులు ఉండగా నెట్ వెనుక వైపు నుంచి బంతిని గోల్ పోస్ట్‌కు చేర్చా' అని చప్పాడు.

తొలి మిజోరం ప్లేయర్ గానూ జెజె రికార్డు

తొలి మిజోరం ప్లేయర్ గానూ జెజె రికార్డు

ఇక ఎఐఎఫ్ఎఫ్ వార్షిక అవార్డును గెలుచుకున్న తొలి మిజోరం ప్లేయర్ గానూ జెజె రికార్డు నెలకొల్పాడు. నార్త్ఈస్ట్ రీజియన్‌లో ఈ అవార్డు అందుకున్న ప్లేయర్లలో ఆరో వ్యక్తి. ఇంతకుముందు భాయిఛుంగ్ భూటియా (సిక్కిం), తొంబాసింగ్, సుర్కుమార్ సింగ్, గౌరామంగీ సింగ్ (మణిపూర్), ఎగెనెసోన్ లింగ్డో (మేఘాలయ) ఈ అవార్డును గెలుచుకున్నారు. 1992 నుంచి ఈ అవార్డును ఎఐఎఫ్ఎఫ్ ప్రదానంచేస్తున్నది.

భారత ఫుట్ బాల్ ఆటకు 2017 చాలా ముఖ్యం

భారత ఫుట్ బాల్ ఆటకు 2017 చాలా ముఖ్యం

భారత ఫుట్ బాల్ ఆటకు 2017 చాలా ముఖ్యమైన సంవత్సరమని తెలిపాడు. దీంతోపాటు 2019 ఆసియా కప్ అర్హత పోటీలు కూడా జరుగుతాయి. ‘వచ్చే ఏడాది చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం మన దేశీయ జట్టు ర్యాంకింగ్ 135వ స్థానానికి చేరుకున్నది. ఎక్కడికైనా వెళ్లొచ్చు' అని అన్నాడు. ‘వచ్చే ఏడాది చాలా కీలకం. మనం ఆటలో ప్రతిభను పెంపొందించుకోవాలి. ఆసియా కప్ అర్హత పోటీల్లో పోరాడాలి. యువ జట్టు ముందు ఉన్న అవసరాలివి' అని ఆయన అన్నాడు. వచ్చే నెల 23న ఆసియా కప్ అర్హత పోటీల డ్రా తీస్తారు. మార్చి 28న తొలి మ్యాచ్ భారత్ జట్టు ఆడుతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+